తెలంగాణ

telangana

ETV Bharat / state

దిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈ నెల 21 వరకు కవితకు జ్యుడీషియల్‌ రిమాండ్‌ - MLC Kavitha Judicial Custody Extended

BRS MLC Kavitha Judicial Custody Again : దిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు జ్యుడీషియల్‌ రిమాండ్‌ను న్యాయస్థానం మరోసారి పొడిగించింది. సీబీఐ నమోదు చేసిన కేసులో ఈ నెల 21 వరకు కవితకు రిమాండ్‌ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మద్యం కేసులో కవిత పాత్రపై సీబీఐ సప్లిమెంటరీ ఛార్జిషీట్ దాఖలు చేయగా, పరిగణనలోకి తీసుకునే అంశంపై విచారణను జులై 6న చేపడతామని స్పెషల్ కోర్టు స్పష్టం చేసింది.

BRS MLC Kavitha Judicial Custody
BRS MLC Kavitha Judicial Custody Again (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jun 7, 2024, 3:05 PM IST

Updated : Jun 7, 2024, 5:04 PM IST

MLC Kavitha Judicial Custody Extended : దిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన సీబీఐ కేసులో ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్‌ కస్టడీని దిల్లీలోని రౌజ్‌ అవెన్యూ న్యాయస్థానం మరో రెండు వారాలపాటు పొడిగించింది. దర్యాప్తు సంస్థ సీబీఐ నమోదు చేసిన కేసులో ఈ నెల 21 వరకు కవితకు రిమాండ్‌ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. లిక్కర్ స్కాం కేసులో కవిత పాత్రపై సీబీఐ సప్లిమెంటరీ ఛార్జిషీట్ దాఖలు చేయగా, పరిగణనలోకి తీసుకునే అంశంపై విచారణను జులై 6న చేపడతామని ప్రత్యేక న్యాయస్థానం స్పష్టం చేసింది. చదువుకోవడానికి కొత్తగా 9 పుస్తకాలు కావాలని కవిత కోరగా, ఆమె అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం అందుకు అంగీకరించింది.

Last Updated : Jun 7, 2024, 5:04 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details