Mistakes in Andhra Pradesh Voter list 2024 : ఓటర్ల తుది జాబితా తప్పుల తడకగా విడుదలైంది. ఫిర్యాదులపై ఓటర్ల జాబితాలో మార్పులు చేసి, తప్పులు సరిదిద్దామని ఎన్నికల అధికారులు చేస్తున్న ప్రకటనలకు భిన్నంగా క్షేత్రస్థాయిలో కనిపిస్తోంది. గ్రామానికి సంబంధంలేని వ్యక్తుల పేర్లు సైతం తుది జాబితాలో కనిపిస్తుంటే స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. అనంతపురం జిల్లా పాత చెదళ్ల గ్రామంలో స్థానికేతరుల ఓట్లు కొనసాగుతుండటంపై గ్రామస్తులు నివ్వెరపోతున్నారు.
తుది జాబితాలోనూ వైఎస్సార్సీపీ దొంగ ఓట్ల దందా
Doble Votes Problems In Anantapur District :అనంతపురం జిల్లాలో ఓటర్ల జాబితాలో అక్రమాలకు పాల్పడిన, నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై కేంద్ర ఎన్నికల కమిషన్ సస్పెన్షన్ వేటు వేసింది. ఎన్నికల సంఘం వేటు వేస్తున్నప్పటికీ ఓటర్ల జాబితా పర్యవేక్షిస్తున్న అధికారుల్లో మార్పు రావటం లేదు. ఈనెల 22న విడుదల చేసిన ఓటర్ల తుది జాబితా అంతా స్వచ్ఛంగా ఉందని, తప్పులు సరిచేశామని కలెక్టర్ గౌతమి తెలిపారు. అయితే ఈ జాబితా కూడా తప్పుల తడకగా ఉందని, అక్రమాల పరంపర కొనసాగుతూనే ఉందని స్పష్టమవుతోంది. బుక్కరాయసముద్రం మండలం పాతచెదళ్ల గ్రామంలో 1359 ఓటర్లు ఉండగా వాటిలో వందకు పైగా బోగస్ ఓట్లు గానూ, మరి కొన్ని స్థానికేతరులవిగా ఉన్నట్లు గ్రామస్తులు గుర్తించారు. గ్రామానికి సంబంధం లేని వ్యక్తుల పేర్లును అక్రమంగా ఓటర్ల జాబితాలో చేర్చారంటూ గ్రామస్తులు.
ఓట్ల అక్రమాలపై కొరడా ఝుళిపిస్తున్నా మారని అధికారుల తీరు - టీడీపీ నేతల మండిపాటు