Donga Babas Stole Rs 30 Lakhs from Woman : ప్రతిరోజు టీవీ చూస్తున్నప్పుడు గానీ, సోషల్ మీడియాలో రీల్స్, యూట్యూబ్లో వీడియోలు చూస్తున్నప్పుడు గానీ, ఏవైనా వీడియో పెట్టినప్పుడు గానీ 'మీ ఇంట్లో దెయ్యాలు తిరుగుతున్నాయా, మీ పిల్లలకు ఎంత చదివినా ఉద్యోగం రావడం లేదా, వయసు పెరుగుతున్నా పెళ్లి కావడం లేదా, ప్రేమికుడు ప్రేమలో పడడానికి వశీకరణం చేయాలా, మీ ఇంట్లో ఆరోగ్య పరిస్థితులు బాగోలేదా, మీ ఇంట్లో నరఘోష ఉందా అయితే వెంటనే మా జ్యోతిష్యాలయం నంబరును సంప్రదించండి. మీ సమస్యలు అన్నీ సత్వరం పరిష్కరిస్తాం' లాంటి యాడ్లు దర్శనమిస్తుంటాయి. ఒకవేళ నిజంగా ఇంట్లో సమస్యలు పూర్తిగా తొలగిపోతాయని భావించి ఆత్రుతతో ఆ నంబరుకు కాల్ చేశామో ఇక అంతే. మీ జేబులు ఖాళీ అవ్వడం ఖాయం!
నిజంగా ఇలాంటివి నమ్మేవారు అన్ని వర్గాల్లోనూ ఉంటున్నారు. ముఖ్యంగా ఈ 'డబ్బు' కాలంలో ఇలాంటి మూఢ నమ్మకాలు ఎక్కువగా పెరిగిపోతున్నాయి. తొందరగా డబ్బు సంపాదించాలనే ఆశతో చాలా మంది ఇటువంటి మార్గాల వైపు వెళుతున్నారు. ఇలాంటి వారినే టార్గెట్గా చేసుకొని అలాంటి దొంగబాబాలు భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లోనే కాకుండా, రోడ్డు పక్కల ఈ బిజినెస్ యమ వేగంగా సాగుతోంది. వీటిని నమ్మిన వారు పూర్తిగా చితికిపోతున్నారు. దొంగ బాబాల వేషంలో వచ్చి అత్యాచారాలకు ఒడిగొన్న ఘటనలూ చూస్తున్నాం. ఇలా మోసపోయామని బయటకు చెప్పుకోలేక ఎందరో లోలోపల కుమిలిపోయిన వారున్నారు. తాజాగా హైదరాబాద్లో ఇలాంటి ఘటనే వెలుగు చూసింది.
ఇంట్లో ఆత్మ తిరుగుతోందని రూ.30 లక్షలు స్వాహా : ఇంట్లో ఆత్మ తిరుగుతోందని, దోష నివారణ పూజలు చేయకుంటే, ఇంట్లో కుటుంబం మొత్తం చనిపోతారని భయాందోళనలకు గురి చేసి ఓ ఫ్యామిలీ వద్ద దొంగ బాబాలు ఏకంగా రూ.30 లక్షలు వసూలు చేశారు. ఈ ఘటన సికింద్రాబాద్లోని గాంధీనగర్ ఠాణా పరిధి న్యూ బోయిగూడలో జరిగింది. ఓ మహిళ తన తల్లికి ఆరోగ్యం సరిగ్గా ఉండటం లేదని, సామాజిక మాధ్యమాల్లో వెతకగా, పూజలతో ఆరోగ్య సమస్యలు తీరుతాయనే ప్రకటన చూసింది. వెంటనే వారిని సంప్రదించి పూజలు చేయించింది.