తెలంగాణ

telangana

ETV Bharat / state

తడిసిన ధాన్యాన్ని మద్ధతు ధరకు కొనుగోలు చేస్తాం : మంత్రి ఉత్తమ్ - minister uttam on paddy procurement - MINISTER UTTAM ON PADDY PROCUREMENT

Minister Uttam Review on Stained Grain : రాష్ట్రంలో అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని, పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్​కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఎఫ్‌సీఐ ధర తగ్గిస్తే, తగ్గిన మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని వెల్లడించారు. తాగునీటి కోసం నీరు ఇచ్చేందుకు కర్ణాటక అంగీకరించిందని, నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి రాష్ట్రానికి 2.25 టీఎంసీలు వస్తాయని తెలిపారు.

PADDY PROCUREMENT IN TELANGANA
Minister Uttam Review on Stained Grain (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : May 8, 2024, 7:26 PM IST

Paddy Procurement in Telangana :రాష్ట్రంలో పంట చేతికొచ్చే తరుణంలో అకాల వర్షాలు, రైతులను కలవరపెడుతున్నాయి. ఐకేపీ విక్రయ కేంద్రాలకు తరలించిన ధాన్యం తడిసి ముద్దయ్యింది. ఈ నేపథ్యంలో పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్​ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని మద్ధతు ధరకు కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు.

ఈసారి ఎన్నికల్లో బీజేపీ, బీఆర్​ఎస్​లకు డిపాజిట్లు కూడా దక్కవు : ఉత్తమ్​ కుమార్​ రెడ్డి - Uttam Election Campaign

వర్షానికి ధాన్యం కొట్టుకుపోయి రైతు నష్టపోతే, దానికి కూడా ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి తెలిపారు. ధాన్యం కొనుగోలు విషయాన్ని ప్రభుత్వం అత్యవసర అంశంగా పరిగణిస్తోందన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు పగడ్భందీగా నడుస్తున్నాయని అందుకు కావాల్సిన మౌలిక వసతులు పూర్తి స్థాయిలో కల్పించినట్లు చెప్పారు. రైతుల నుంచి ధాన్యాన్ని ఎఫ్‌సీఐ తీసుకునే సమయంలో ధర తగ్గితే ఆ తగ్గిన మొత్తం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని వెల్లడించారు.

మిల్లర్లు తరుగు తీస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గతేడాది ఇదే సమయానికి 13.77 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారని, ఇప్పుడు 24.85 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసినట్లు వివరించారు. గతంలో కంటే ఈసారి రెట్టింపు కొనుగోలు చేసామన్నారు. కొనుగోలు చేసిన ధాన్యానికి డబ్బులను మూడు నాలుగు రోజులకే చెల్లిస్తున్నామని తెలిపారు.

తనతో పాటు సీఎం రేవంత్ రెడ్డి మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి తాగునీటి కోసం నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి కృష్ణా నీటి నుంచి ఇవ్వాలని కర్ణాటక ప్రభుత్వాన్ని కోరగా 2.25 టీఎంసీల నీళ్లు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసిందని వెల్లడించారు. మేడిగడ్డపై ఎన్‌డీఎస్‌ఏ మధ్యంతర నివేదిక ఇచ్చిందని పూర్తి నివేదిక రావాల్సి ఉందని, వారం పది రోజుల్లో సమగ్ర నివేదిక వస్తుందని మంత్రి వివరించారు.

DS Chauhan on Stained Grain :మరోవైపుఅకాల వర్షాల కారణంగా తడిసిన ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ అన్నారు. సిద్దిపేట జిల్లా కొమ్మురవెల్లిలోని పీపీపీ కేంద్రాలను ఆయన సందర్శించారు. ప్రైవేట్ భూముల్లో ఏర్పాటు చేసిన పీపీసీ కేంద్రాల అద్దెను రైతుల నుంచి వసూలు చేస్తున్న విషయాన్ని అధికారులతో ఆరా తీశారు. ఐకేపీ కేంద్రాల సొసైటీ కమీషన్‌ నుంచి పీపీసీలు అద్దె చెల్లించాలని జాయింట్‌ కలెక్టర్‌ను డీఎస్ చౌహాన్ ఆదేశించారు.

బీజేపీకి ఓటేస్తే రిజర్వేషన్లకు ముప్పు : మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి - Minister Uttam about Reservation

మేడిగడ్డ కుంగితే అప్పుడే ఎందుకు మరమ్మతు చేయలేదు - కేసీఆర్‌పై ఉత్తమ్‌ ఫైర్ - lok sabha elections 2024

ABOUT THE AUTHOR

...view details