తెలంగాణ

telangana

ETV Bharat / state

కొహెడ నుంచి అంతర్జాతీయంగా పండ్ల ఎగుమతులు జరిగేలా చర్యలు: మంత్రి తుమ్మల - Minister Tummala on Fruit Exports

Minister Tummala Review on Fruit Exports : కొహెడ పండ్ల మార్కెట్​యార్డ్​​ నుంచి అంతర్జాతీయంగా ఎగుమతులు జరిపే విధంగా చర్యలు చేపట్టనున్నామని మంత్రి తుమ్మల వెల్లడించారు. ఈ మేరకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. మార్కెటింగ్, జౌళి, ఫుడ్​ ప్రాసెసింగ్ యూనిట్లపై అధికారులతో మంత్రి సమీక్షించారు. ఖమ్మం మార్కెట్​ యార్డు ఆధునికీకరణకు సంబంధించి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

Minister Tummala Review on Fruit Exports
Minister Tummala Review on Fruit Exports (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : May 17, 2024, 4:44 PM IST

Minister Tummala Review on Fruit Exports :తెలంగాణకు తలమానికంగా నిలవనున్న కొహెడ పండ్ల మార్కెట్ నుంచి అంతర్జాతీయంగా పండ్ల ఎగుమతులు జరిగేలా చర్యలు తీసుకోనున్నామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సచివాలయంలోని తన ఛాంబర్‌లో మార్కెటింగ్, ఔళి, ఆహార శుద్ధి యూనిట్ల ఏర్పాటుపై మంత్రి సమీక్షించారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్​ యార్డును అంతర్జాతీయ ప్రమాణాలతో ఆధునీకరించేందుకు చర్యలు చేపట్టే విధంగా అధికారులకు ఆదేశాలిచ్చారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్​రంజన్, టీఎస్ఐఐసీ ఎండీ విష్ణువర్ధన్ రెడ్డి, జౌళి శాఖ సంచాలకులు అలుగు వర్షిణి, ఉద్యాన శాఖ సంచాలకులు అశోక్ రెడ్డి, వ్యవసాయ మార్కెటింగ్ శాఖ సంచాలకులు జి.లక్ష్మీబాయి పాల్గొన్నారు.

ఖమ్మం మార్కెట్​ యార్డుపై మంత్రి తుమ్మల సమీక్ష :అన్ని మౌలిక సదుపాయాలతో కొహెడ మార్కెట్ యార్డు అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని మార్కెటింగ్ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రైతాంగం సౌకర్యార్థం ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌ యార్డును అంతర్జాతీయ ప్రమాణాలతో ఆధునికీకరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్రంలో మార్కెటింగ్, గిడ్డంగుల సంస్థ గోదాములపై సౌరశక్తి ప్యానెల్స్ ఏర్పాటు దిశగా చర్యలు తీసుకుంటున్నామని ప్రకటించారు. రాష్ట్రంలో తరచూ సంభవిస్తున్న అకాల వర్షాల నేపథ్యంలో రైతులు పంట నష్టపోకుండా ప్రతి జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

రైతులకు నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలి : మంత్రి తుమ్మల

"తెలంగాణ రాష్ట్ర చేనేత సహకార సంఘం - టెస్కో సంస్థ ద్వారా రాష్ట్రంలో "శానిటరీ నాప్ కిన్" తయారీ యూనిట్లు ఏర్పాటు చేయనున్నాం. బుగ్గపాడు మెగా టెక్స్‌టైల్ పార్కులో వచ్చే నెలలో పరిశ్రమల ప్రారంభోత్సవం దిశగా చర్యలు తీసుకుంటున్నాం. రాష్ట్రంలో మార్కెటింగ్, గిడ్డంగుల సంస్థ గోదాములపై సౌరశక్తి ప్యానెల్స్ ఏర్పాటు దిశగా చర్యలు తీసుకుంటున్నాం. ప్రతి జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించాం"- తుమ్మల నాగేశ్వర రావు, మంత్రి

రాష్ట్రంలో ఫుడ్​ ప్రాసెసింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే దృష్టి సారించింది. ఫుడ్​ ప్రాసెసింగ్ రంగం ద్వాారా వచ్చే ఉపాధి అవకాశాలపైనా ప్రభుత్వం ఫోకస్​ పెట్టింది. తాజాగా మంత్రి తుమ్మల కూడా ఇదే అంశంపై అధికారులతో చర్చించారు. ఆహార శుద్ది ఏర్పాట్లుపై దృష్టి సారించారు.

ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లపై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ - Govt Focus On Food Processing

రాష్ట్రంలో ఆహార శుద్ధి రంగంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి - ఔత్సాహికులకు ప్రోత్సాహం - Government Focus Food Processing

ABOUT THE AUTHOR

...view details