తెలంగాణ

telangana

ETV Bharat / state

విత్తనాల సరఫరాలో కంపెనీలు ప్రభుత్వానికి సహకరించాలి : మంత్రి తుమ్మల - MINISTER TUMMALA ON SEEDS SUPPLY - MINISTER TUMMALA ON SEEDS SUPPLY

Minister Tummala on Seeds in Telangana : రాబోయే వర్షాకాలం ఆధారంగా మొక్కజొన్న, ఇతర విత్తనాల సరఫరాలో విత్తన కంపెనీలు ప్రభుత్వానికి సహకరించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. వివిధ పంటల సాగు వివరాలు, విత్తన లభ్యతపై ప్రైవేట్ కంపెనీ ప్రతినిధులతో మంత్రి సమీక్షి నిర్వహించారు.

Minister Tummala about Agriculture
Minister Tummala on Seeds in Telangana

By ETV Bharat Telangana Team

Published : Mar 28, 2024, 9:40 PM IST

Minister Tummala on Seeds in Telangana : రాబోయే వానా కాలం దృష్ట్యా పత్తి విత్తనాలు కాకుండా మొక్కజొన్న, ఇతర విత్తనాల సరఫరాలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విత్తన కంపెనీలు ప్రభుత్వానికి సహకరించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రాష్ట్రంలో 2024 ఖరీఫ్ సీజన్ సంవత్సరం సంబంధించి వివిధ పంటల సాగు వివరాలు, విత్తన లభ్యతపై మంత్రి వివిధ ప్రైవేట్ కంపెనీ ప్రతినిధులతో సమీక్షించారు. రాష్ట్రంలో పత్తి రెండవ ప్రధాన పంటగా ఉందని, వచ్చే వానాకాలం కూడా దాదాపు 60.53 లక్షల ఎకరాల విస్తీర్ణంలో సాగు కావచ్చని తెలిపారు.

Minister Tummala about Agriculture : అందుకోసం 121.06 లక్షల ప్యాకేట్లు అవసరం ఉందని, దానికి తగ్గట్లు అన్ని ప్రైవేట్ విత్తన కంపెనీలు వ్యవసాయ శాఖ ప్రణాళిక ప్రకారం పత్తి విత్తనాలు సరఫరా చేయాలని మంత్రి తుమ్మల ఆదేశించారు. ఇతర ప్రధాన పంటలు చూసుకొన్నట్లైతే వరి 16,50,000 క్వింటాళ్లు, మొక్కజొన్న 48,000 క్వింటాళ్లు అవసరమవుతాయని అంచనా వేసినట్లు చెప్పారు. రాష్ట్ర అవసరాలకు మొట్టమొదటి ప్రాధాన్యతగా విత్తన కంపెనీలు భావించాలని సూచించారు. ప్రస్తుతం విత్తన లైసెన్సింగ్ విధానంలో కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉందని ప్రస్తావించారు. విత్తన సరఫరాలో పారదర్శకత, నాణ్యమైన విత్తన సరఫరా కోసం విత్తన కంపెనీ ప్రతినిధులు సూచించిన కొన్ని అంశాలు పరిశీలిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

రైతాంగం ప్రయోజనాల కోసం :ఆయా కంపెనీల విత్తన ఉత్పత్తి వివరాలు, రాష్ట్రానికి సరఫరా చేసే విత్తనాల వివరాలు, గత సంవత్సరం ఖరీఫ్ సీజన్‌లో సరఫరా చేసిన విత్తనాల పరిమాణం వంటి వివరాలు విడివిడిగా కంపెనీల ప్రతినిధులను మంత్రి తుమ్మల అడిగి తెలుసుకున్నారు. రైతాంగం ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని అన్ని రకాల విత్తనాల సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో సహకరించాలని మంత్రి సూచించారు.

ఇదికాగా ఇటీవలే రాష్ట్రంలో అకాల వర్షాలకు పలు చోట్ల తీవ్రస్థాయిలో రైతులు పంట నష్టపోయారు. దీనిపై వెంటనే స్పందించిన మంత్రి తుమ్మల, అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు. పంట నష్టాన్ని అంచనా వేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి(CM Revanth Reddy) ఆదేశించినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతల పట్ల పూర్తి చిత్తశుద్ధితో ఉందని తెలిపారు.

నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది : మంత్రి తుమ్మల

"ఆయిల్‌పామ్‌ పంటకు లాభదాయకమైన ధరలు ప్రకటించాలి"- కేంద్రానికి మంత్రి తుమ్మల లేఖ

ABOUT THE AUTHOR

...view details