తెలంగాణ

telangana

ETV Bharat / state

నో ప్లాస్టిక్ జోన్​గా మేడారం జాతర - భారీ ఎత్తున అవగాహనకు ప్రణాళిక

Minister Sitakka Awareness on Plastic Free Medaram Festival : త్వరలో జరగబోయే మేడారం ఉత్సవాలను ప్లాస్టిక్‌ రహిత ఉత్సవాలుగా జరుపుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జిల్లా అధికారులతో కలిసి మంత్రి సీతక్క మేడారంలో ప్లాస్టిక్‌ నిషేధంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

Medaram Fair Start From February 21 to 24
Minister Sitakka Awareness on Plastic Free Medaram Festival

By ETV Bharat Telangana Team

Published : Feb 3, 2024, 7:35 PM IST

Updated : Feb 3, 2024, 8:44 PM IST

మేడారంలో ప్లాస్టిక్ నివారణకు మంత్రి సీతక్క అవగాహన కార్యక్రమం

Minister Sitakka Awareness on Plastic Free Medaram Festival : ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం జాతరను(Medaram Festival) ప్లాస్టిక్ రహితంగా నిర్వహించాలంటూ రాష్ట్ర మంత్రి సీతక్క(Minister Sitakka) అధికారులను ఆదేశించారు. ప్లాస్టిక్‌పై అవగాహన కల్పించేందుకు నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఆలయ పరిసరాలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దైవ దర్శనం చేసుకునే భక్తులు ప్లాస్టిక్ తీసుకురావొద్దని విజ్ఞప్తి చేశారు. జాతరకు వచ్చిన భక్తులు సంచుల్లో వ్యర్థ పదార్థాలు ఎక్కడపడితే అక్కడ వేస్తున్నారన్నారు.

మినీ మేడారం అగ్రంపాడు సమ్మక్క సారలమ్మ జాతర - ఈ విషయాలు తెలుసా?

దీంతో పెద్దఎత్తున ప్లాస్టిక్‌ పేరుకుపోయి స్థానిక గ్రామస్తులు దుర్వాసనతో అనారోగ్యానికి గురవుతున్నారని మంత్రి సీతక్క పేర్కొన్నారు. జాతరను పర్యావరణ అనుకూలంగా ప్రజలకు జరుపుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరు పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉండాలన్నారు. వ్యర్థ పదార్థాలను డస్ట్ బిన్స్​లోనే వేయాలని అలా వేస్తే ఇక్కడ నివసిస్తున్న గ్రామస్తుల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు.

"త్వరలో జరగబోయే మేడారం ఉత్సవాలను ప్లాస్టిక్‌ రహిత ఉత్సవాలుగా జరుపుకోవాలి. దైవ దర్శనం చేసుకునే భక్తులు ప్లాస్టిక్ సంచుల్లో వ్యర్థ పదార్థాలు ఎక్కడపడితే అక్కడ వేస్తున్నారు. దీంతో పెద్దఎత్తున ప్లాస్టిక్‌ పేరుకుపోయి స్థానిక గ్రామస్తులు దుర్వాసనతో అనారోగ్యానికి గురవుతున్నారు. జాతరను పర్యావరణ అనుకూలంగా జరుపుకోవాలి. ప్రతి ఒక్కరు పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉండాలి". - సీతక్క, మంత్రి

Medaram Fair Start From February 21 to 24 :దేశంలోనే ప్రసిద్ధి చెందిన ఆదివాసీ గిరిజన జాతరగా ములుగు(Mulugu) జిల్లాలోని మేడారం జాతర పేరొందింది. ప్రతి రెండేళ్లకోసారి మేడారం మహా జాతర వైభవంగా సాగుతుంది. ఈనెల ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు ఈ మహా జాతర జరగనుంది. కోటిన్నర మందికి పైగా భక్తులు తరలివచ్చే అవకాశమున్న ఈ జాతర కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.75 కోట్ల నిధులను విడుదల చేసింది.

మేడారం సమక్క, సారలమ్మ జాతరకు ఆర్టీసీ సిద్ధం

2022లో మేడారం జాతర జరగగా మళ్లీ 2024లో జరుగుతోంది. ఈ మేరకు ఫిబ్రవరి 14న మాఘశుద్ధ పంచమి రోజున మండె మెలిగె, గుడి శుద్ధీకరణ క్రతువుతో జాతర ప్రారంభం కానుంది. నాలుగు రోజుల పాటు వనమంతా జనమై వన దేవతలను దర్శించుకుంటారు. తెలుగు రాష్ట్రాలు సహా ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, ఝార్ఖండ్ తదితర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు.

మేడారం వెళ్లే భక్తులకు 'టోల్ ​గేట్​' కష్టాలు - పర్యావరణ రుసుం నిలిపివేస్తున్నట్లు మంత్రి కొండా సురేఖ ప్రకటన

Last Updated : Feb 3, 2024, 8:44 PM IST

ABOUT THE AUTHOR

...view details