Ponnam Review Meeting On New Ration Cards and Indiramma Houses :రేషన్ కార్డుల జారీకి సంబంధించిన ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన తెలంగాణలోని అన్ని జిల్లాలోని అధికారులతో సమావేశమైనట్లు తెలిపారు. ఈ నెల 16 నుంచి 20 వరకు క్షేత్రస్థాయిలో లబ్ధిదారుల పరిశీలను జరుగుతుందని చెప్పారు. 21 నుంచి అర్హులైన వారి డేటా ఎంట్రీ చేస్తామన్నారు. 26 నుంచి కొత్త రేషన్ కార్డుల జారీ ఉంటుందని స్పష్టం చేశారు. రేషన్ కార్డుల, ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తుల స్వీకరిస్తామని చెప్పారు.
ఇందిరమ్మ గృహ కల్పన పథకంలో హైదరాబాద్‌లో స్థలం ఉండి ఇల్లు లేని వారికి తొలి ప్రాధాన్యత ఇస్తమన్నారు. ఇల్లు లేని వారందరికీ మంజూరు చేయాలని ప్రభుత్లం కృతనిశ్చయంతో ఉందని తెలిపారు. ఇతర జిల్లాల నుంచి వల వచ్చిన వారికి కూడా రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్నారు. వీటి పంపిణీలో ఆదర్శంగా నిలుస్తామని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా పేదలందరికీ న్యాయం చేయాలనేది ప్రభుత్వ లక్ష్యమన్న ఆయన అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పథకాలు వర్తింపజేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వివరించారు. అసంపూర్తిగా ఉన్న రెండు పడక గదుల ఇళ్లను పూర్తి చేయడానకి గుత్తేదారుతలతో మాట్లాతమని తెలిపారు. పూర్తయిన ఇళ్లను లాటరీ వేసి లబ్ధిదారులను ఎంపిక చేస్తామని స్పష్టం చేశారు.