Ponguleti Challanges BRS Leaders : నగర పరిధిలో అక్రమ నిర్మాణాలపై కొరడా ఝళిపించేందుకు హైడ్రాను తెచ్చామని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ఇకపై ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్స్ పరిధిలో నిర్మాణాలను అనుమతించేది లేదని ఆయన స్పష్టం చేశారు. అలాంటి కట్టడాలను కూల్చుతున్నామని, అవన్నీ గత ప్రభుత్వ హయాంలో జరిగిన కట్టడాలని పొంగులేటి తెలిపారు.
మంత్రి సవాల్ : హిమయత్‌సాగర్ ప్రాంతంలో ఎఫ్‌టీఎల్ పరిధిలో తన ఫాంహౌస్ ఉందని బీఆర్ఎస్ పార్టీ మీడియా బురదజల్లుతోందని పొంగులేటి దుయ్యబట్టారు. తన ఇల్లు అక్రమంగా ఉంటే వెంటనే కూల్చాలని హైడ్రా కమిషనర్‌కి ఆదేశిస్తున్నట్లు వెల్లడించారు. తాను కేటీఆర్, హరీశ్‌రావులకు సవాల్ విసురుతున్నానని, హైడ్రా అధికారుల బదులు మీరే వెళ్లి తన ఇంటిని కొలవండని, అక్రమమని తేలితే కూల్చేయాలని సవాల్ విసిరారు.
మీతో చెప్పించుకునే పరిస్థితుల్లో ఈ పొంగులేటి లేడని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదో చేసేందుకు తనను బూచిగా చూపాలని చూస్తున్నారని ఆయన మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతలు తన సవాల్‌ను స్వీకరించాలని స్పష్టం చేశారు. అక్కడ తానే నివసిస్తున్నానని, బీఆర్ఎస్ నేతల మాదిరి ఫాంహౌస్ నాది కాదని, స్నేహితులదంటూ తప్పించుకోనని వ్యాఖ్యానించారు.
రుణమాఫీపై కీలక వ్యాఖ్యలు :సాంకేతిక కారణాలతో ఇంకా 12వేల కోట్లు రుణమాఫీ చేయాల్సి ఉందని మంత్రి పేర్కొన్నారు. 2 లక్షలకు పైగా రుణం తీసుకున్న రైతులు అదనపు మొత్తం చెల్లిస్తే రూ.2 లక్షలు రుణ మాఫీ ప్రభుత్వం చేస్తుందని పొంగులేటి వెల్లడించారు. ఇందుకు కూడా ఒక కటాఫ్ తేదీన పెట్టి ఆ లోపు చెల్లించిన వారందరికి రుణమాఫీ పూర్తి చేస్తామని వివరించారు. అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ చేసేందుకు ఇంకా 12 వేల కోట్లు అయినా, 13వేల కోట్లు అయినా చేసేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని వెల్లడించారు.
"హైడ్రాను మంచి ఉద్దేశంతో తెచ్చాము. హిమయత్‌సాగర్ ప్రాంతంలో ఎఫ్‌టీఎల్ పరిధిలో నా ఫాంహౌస్ ఉందని బీఆర్ఎస్ పార్టీ మీడియా బురదజల్లుతోంది. నా ఇల్లు అక్రమంగా ఉంటే వెంటనే కూల్చాలని హైడ్రా కమిషనర్‌కి ఆదేశిస్తున్నాను. నేను కేటీఆర్, హరీశ్‌రావులకు సవాల్ విసురుతున్నా. హైడ్రా అధికారుల బదులు మీరే వెళ్లి నా ఇంటిని కొలవండి. అక్రమమని తేలితే కూల్చేయండి". - పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రెవెన్యూ మంత్రి
రాష్ట్రంలో త్వరలోనే లొసుగుల్లేని పటిష్ఠమైన రెవెన్యూ చట్టం : మంత్రి పొంగులేటి - NEW REVENUE ACT IN TELANGANA
పూర్తి శాస్త్రీయ పద్దతిలో రిజిస్ట్రేషన్ విలువల పెంపు : మంత్రి పొంగులేటి - Ponguleti on Registration Fees Hike