Minister Lokesh Helpful For Telugu Worker Shiva Reached AP: కువైట్‌లో దుర్భర జీవితం గడుపుతున్న తెలుగు వ్యక్తి శివ విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ చొరవతో స్వస్థలానికి చేరుకున్నాడు. కువైట్‌లో తన కష్టాలపై తెలుగు కార్మికుడు శివ కన్నీళ్లు పెట్టుకుంటూ ఎక్స్‌లో పోస్టు పెట్టిన వీడియోపై మంత్రి లోకేశ్ స్పందించారు. తనకు సాయం చేయకపోతే చావే దిక్కంటూ శివ వేడుకోవడంతో లోకేశ్ అండగా నిలిచారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో త్వరలోనే శివను ఏపీకి తీసుకొస్తామని మంత్రి నారా లోకేశ్ తెలిపారు.
శివ పెట్టిన వీడియోపై లోకేశ్ స్పందించి టీడీపీ ఎన్‌ఆర్‌ఐ బృందానికి ఆ బాధ్యతను అప్పగించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో బాధితుడ్ని ఏపీకి తీసుకొచ్చే వరకు వ్యవహారాన్ని స్వయంగా మంత్రి పర్యవేక్షించారు. శివ స్వస్థలం మదనపల్లి చేరుకోవడం పట్ల లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు. శివను చూసి అతని కుటుంబ సభ్యులు తీవ్ర భావోద్వేగానికి గురైన వీడియోను లోకేశ్ ఎక్స్‌లో పోస్టు చేశారు.
కువైట్‌లో కష్టపడుతున్న వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయగా నారా లోకేశ్ స్పందించి టీడీపీ ఎన్‌ఆర్‌ఐ బృందంతో నా స్వస్థలానికి తీసుకువచ్చారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ కుటుంబానికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ప్రాణం ఉన్నంతవరకు ఈ సహాయాన్ని గుర్తు పెట్టుకుంటాం. - శివ, కువైట్ బాధితుడు.
నారా లోకేశ్ చొరవ - కువైట్‌లో తెలుగు కార్మికుడిని కాపాడిన ఇండియన్ ఎంబసీ - త్వరలో రాష్ట్రానికి