Minister Konda Surekha Bicycle Riding :రాష్ట్రఅటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ ఎప్పుడూ తనదైన శైలిలో వార్తల్లో ఉంటుంటారు. తాజాగా ఆమె ఇవాళ సైకిల్‌పై సవారీ చేస్తూ కనిపించారు. అయితే ఇది ఉదయం ఎక్సర్సైజ్ కోసం చేసే సైక్లింగ్ కాదు పాఠశాల విద్యార్థులను ఉత్సాహపరిచేందుకు చేసిన సైకిల్ రైడింగ్.
సైకిల్‌పై మంత్రి కొండా సురేఖ సవారీ - KONDA SUREKHA BICYCLE RIDING
వరంగల్‌లో సైకిలెక్కి సందడి చేసిన మంత్రి కొండా సురేఖ - భర్త కొండా మురళి జన్మదినోత్సవం పురస్కరించుకుని విద్యార్థినులకు సైకిళ్ల పంపిణీ
Published : Oct 25, 2024, 9:46 PM IST
ఇంతకీ ఏం జరిగిందంటే ఇవాళ తన భర్త కొండా మురళి జన్మదినోత్సవం సందర్భంగా పలు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగా స్థానిక బట్టల బజార్‌లోని ఆంధ్ర బాలిక ప్రభుత్వోన్నత పాఠశాలకు వెళ్లారు. అక్కడ విద్యార్థునులకు మంత్రి సురేఖ సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చిన్నారులను చూసి తనకు సైకిల్ తొక్కాలని అనిపించింది కాబోలు వెంటనే బాలికలతో కలిసి కొద్ది సేపు సైకిల్ తొక్కి వారిని ఉత్సాహపరిచారు. బాలికలతో పోటీగా సైకిల్ నడిపి ఔరా అనిపించారు. విద్యార్థినులు బాగా చదువుకొని ఉన్నత స్థితికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని మంత్రి సూచించారు.