Minister Konda Surekha Review On Forest Fire Accidents : అటవీ స్మగ్లర్లపై కఠిన చర్యల కోసం పీడీ యాక్ట్ (PD Act) పెట్టాలని అధికారులకు మంత్రి కొండా సురేఖ (Konda Surekha) సూచించారు. దీనికోసం పోలీస్ శాఖ సహకారం తీసుకోవాలని చెప్పారు. వేసవిలో అటవీఅగ్ని ప్రమాదాల నివారణ, జంతువులకు నీటి వసతిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. పెంపుడు పశువులు అడవుల్లోకి పోకుండా అటవీ శివారుల్లో “పల్లె పశువుల వనాల” ఏర్పాటుపై అధ్యయనం చేయాలని సూచించారు.
సమావేశంలో స్థానిక జాతులు, చెట్లు, విత్తనాలు సేకరించడంపై విస్తృతంగా చర్చించారు. స్థానిక జాతులు చెట్ల విత్తనాలు సేకరించి, మెరుగైన మొక్కలు నర్సరీల్లో పెంచాలని ఆదేశించారు. చింత, జామ, నేరేడు, రేగు, సీతాఫలం, మునగ లాంటివి పెంచటం వల్ల అటవీ జంతువులు బయటకు రాకుండా ఉంటాయని తెలిపారు. వచ్చే సీజన్‌పై జిల్లా సమీక్షా సమావేశాలు జరిపి లక్ష్యాలతో పాటు అవసరమైన మెటీరియల్ సిద్ధం చేసుకోవాలని సూచించారు. అడవుల ఆక్రమణ సహించమన్న మంత్రి కొండా సురేఖ గుత్తికోయ ప్రభావిత ప్రాంతాల్లో తదుపరి ఆక్రమణలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
వన్యప్రాణులను వేట కోసం నాటు బాంబులు, తుపాకులు - సీజ్ చేసిన అధికారులు
Minister Review With Forestry Department : ఇటీవల కాగజ్‌నగర్‌లో పులుల మరణం తనను కలిచివేసిందని భవిష్యత్తులో అలాంటి సంఘటనలు జరగకూడదని ఆదేశించారు. అడవుల ఆక్రమణ సహించమని, గుత్తికోయ ప్రభావిత ప్రాంతాల్లో తదుపరి ఆక్రమణలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఇందుకోసం ఇతర శాఖల మద్ధతు తీసుకోవాలని సూచించారు. కొత్తగా అటవీ స్టేషన్ల ఏర్పాటు, సిబ్బందికి ఆయుధాల విషయం ప్రభుత్వ పరిధిలో ఉన్న దృష్ట్యా చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. అడవులకు సంబంధించి కోర్టు వివాదాలను త్వరగా పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.