Euderm Hair and Skin Clinic Hyderabad : ప్రజలకు ప్రైవేటు రంగం మరింత బాధ్యతాయుతంగా వైద్య సేవలు అందించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ప్రజావైద్యంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు రెండూ కీలకపాత్ర పోషించాలని ఆయన పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ఫిలింనగర్‌లో యూడెర్మ్ హెయిర్ అండ్ స్కిన్ క్లినిక్ రెండో శాఖను ఆదివారం ఆయన ప్రారంభించి ప్రసంగించారు.
ఇటీవల కాలంలో చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరికీ జుట్టు రాలడం, ఇతర చర్మ సంబంధిత ఇబ్బందులు వస్తున్నాయని రాజనర్సింహ పేర్కొన్నారు. వాటన్నింటికీ సమగ్రంగా వైద్య సేవలు అందించడానికి వీలుగా ఒకేచోట అన్నిరకాల వైద్యం చేసేందుకు, యూడెర్మ్ హెయిర్ అండ్ స్కిన్ క్లినిక్‌ను ప్రారంభించడం ఎంతో సంతోషకరమని ఆయన అన్నారు. డాక్టర్ సృశాంత్ లాంటి యువకులు ఈ రంగంలో అత్యాధునిక పద్ధతులు పాటిస్తూ ప్రజలకు తమవంతు సేవలు అందించాలని సూచించారు.
అన్ని రకాల వైద్యసేవలు లభ్యం : ఆస్పత్రి ప్రారంభోత్సవం సందర్భంగా డాక్టర్ సృశాంత్ ముక్కా మాట్లాడారు. తాము ఇప్పటికే కోకాపేటలో ఒక ఆస్పత్రి నిర్వహిస్తున్నామని, ఇప్పుడు నగరవాసులకు మరిన్ని సేవలు అందించేందుకు వీలుగా జూబ్లీహిల్స్‌లో సువిశాల ప్రాంగణంలో ఆస్పత్రిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇక్కడ అన్నిరకాల చర్మ, శరీర, జుట్టు సమస్యలకు సంబంధించిన వైద్యులు, మహిళా వైద్యులు, కాస్మోటాలజిస్టులు, డెర్మటాలజిస్టులు కూడా అందుబాటులో ఉంటారని తెలిపారు.