Medigadda Barrage Issue Updates :మేడిగడ్డ ఆనకట్టలో డిజైన్ లోపాలతోపాటు క్వాలిటీ కంట్రోల్ ఇంజినీర్లు నాణ్యత పరీక్షలకు తిలోదకాలిచ్చారా? విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ దర్యాప్తులో అవుననే సమాధానం లభించినట్లు తెలుస్తోంది. ఇటీవలబ్యారేజీని(Vigilance Inquiry On Medigadda)సందర్శించిన విజిలెన్స్ బృందం క్వాలిటీ కంట్రోల్ ఇంజినీర్ల నుంచి అవసరమైన సమాచారం, రికార్డులు కోరగా వారు నీళ్లు నమిలినట్లు తెలుస్తోంది.
Vigilance Inquiry On Medigadda Barrage :బ్యారేజీ ఏడో బ్లాక్ కుంగిపోవడమే కాకుండా గేట్ల దిగువన నీళ్లు పడేచోటు-గ్లేసియర్స్ దెబ్బతిన్నాయి. రెండు పియర్స్ మధ్య ఉన్న గోడ మధ్యలో కాంక్రీటు లేచిపోవడం, పియర్స్ బాగా పాడ్వడంతో నాణ్యతపై విజిలెన్స్ అధికారులు పూర్తిస్థాయిలో దృష్టి పెట్టినట్లు సంబంధిత వర్గాల సమాచారం. నాణ్యతకు సంబంధించి 18 రకాల వివరాలు ఇవ్వాలని క్వాలిటీ కంట్రోల్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరును కోరారు.
మేడిగడ్డ పిల్లర్లు కుంగడంపై విజిలెన్స్ విచారణకు ఆదేశించిన ప్రభుత్వం
Medigadda Barrage Damage :మేడిగడ్డ బ్యారేజీ పునాది పని జరిగే సమయంలో పరిశీలించిన అంశాలు, కోర్ తీసి చేసిన పరీక్షల సమాచారం, ఇన్వెస్టిగేషన్, సర్వే వివరాలను తేదీలు సహా ఇవ్వాలని విజిలెన్స్ బృందం కోరినట్లు తెలిసింది. ఆనకట్ట నిర్మాణం ఏ తేదీన ప్రారంభమైంది. వచ్చిన మెటీరియల్‌ను పరీక్షించిన వివరాలు, కాంక్రీట్ మిక్స్ డిజైన్లు, క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్‌లో చేసిన పరీక్షల వివరాలు, ప్రతినెలా బిల్లులు చెల్లించేందుకు క్వాలిటీ కంట్రోల్ సర్టిఫికెట్ ఇచ్చే ముందు రికార్డుల పరిశీలనకు సంబంధించిన ఆధారాలివ్వాలని అడిగినట్లు సమాచారం.
Kaleshwaram Project Vigilance Inquiry : క్వాలిటీ కంట్రోల్ ఇంజినీర్లు పరిశీలించిన తర్వాత రాసిన రిమార్కులు, సరిదిద్దిన అంశాలు, ఉన్నతాధికారులు పరిశీలించినప్పటి వివరాలు కోరినట్లు తెలిసింది. అదేవిధంగా నిర్మాణ ప్రాంతంలో ఉన్న ఇంజినీర్లతో క్వాలిటీ కంట్రోల్ ఇంజినీర్లు జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాలు, వచ్చిన ఫిర్యాదుపై తీసుకొన్న చర్యలు ఇలా పూర్తిస్థాయిలో వివరాలను కోరినట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది.
మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలపై పర్యావరణ నిపుణుల హెచ్చరిక
వచ్చినవి వచ్చినట్లుగా ఆమోదించడమే క్వాలిటీ కంట్రోల్ పనా అని, విజిలెన్స్ అధికారులు క్వాలిటీ కంట్రోల్ ఇంజినీర్లను నిలదీసినట్లు తెలిసింది. వచ్చే ఫైళ్లు , బయటకు వెళ్లే ఫైళ్ల నంబర్లను సీజ్ చేయాలని ఆదేశించినట్లు సమాచారం. ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. పని జరిగిన తర్వాత క్వాలిటీ కంట్రోల్ విభాగం ఇంజినీర్లు నాణ్యతను పరిశీలించి ప్రమాణాల మేరకు ఉండేలా చర్యలు తీసుకోవాలి. కానీ ప్రాజెక్టు ఉన్నతస్థాయి ఇంజినీర్లు, గుత్తేదారులు ఎలా చెబితే అలా చేశారనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరింతలోతుగా పరిశీలిస్తున్నట్లు సమాచారం.