తెలంగాణ

telangana

ETV Bharat / state

మల్లాపూర్​ పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం - మంటలను అదుపులోకి తెచ్చిన ఫైర్ సిబ్బంది - Fire Accident At Mallapur In HYD

Fire Accident At Mallapur Industrial Estate : హైదరాబాద్​ మల్లాపూర్​లోని పారిశ్రామికవాడలో శనివారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ పెయింట్​ పరిశ్రమలో మంటలు చెలరేగి ఈ ప్రమాదం సంభవించింది. సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. దట్టమైన పొగలు వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

Fire Accident At Mallapur  Industrial Estate
Fire Accident At Mallapur Industrial Estate (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Sep 7, 2024, 5:52 PM IST

Updated : Sep 7, 2024, 10:54 PM IST

Fire Accident At Mallapur Industrial Estate :నాచారం పోలీస్​ స్టేషన్​ పరిధిలోని మల్లాపూర్​ పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రాంసన్ పెయింట్​ పరిశ్రమలో మంటలు చెలరేగి ఈ ప్రమాదం సంభవించింది. సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని నాలుగు ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు. రాంసన్​ గోదాం పక్కకు ఆనుకొని ఉన్న తిరుమల వుడ్​ కాలనీ ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. కాగా ప్రమాదానికి కారణం తెలియాల్సి ఉంది. రాష్ట్రంలో ఏదో చోట అగ్నిప్రమాదాలు జరుగుతూ ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

"అగ్ని ప్రమాదం జరిగిందని సాయంత్రం 4:30 గంటలకు మాకు సమాచారం వచ్చింది. ఐదు అగ్నిమాపక ఇంజిన్లతో ఘటనా స్థలానికి చేరుకున్నాము. రెండు గంటలపాటు శ్రమించి మంటలు అదుపులోకి తెచ్చాము. అదనంగా 10 వాటర్ ట్యాంకర్లు రప్పించి మంటలను అదుపులోకి తెచ్చాము. వాటర్​తో పాటు ఫోంస్ప్రే చేసి మంటలు అదుపు చేశాము. గోదాంలో పెయింట్ సామాగ్రిని భద్రపరిచిన్నట్లు గుర్తించాము. పెయింట్ డ్రమ్ములు ఉండడం వల్ల అగ్ని ప్రమాదం తీవ్రత పెరిగింది.ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. యజమాని పెయింట్ గోదాంలో ఫైర్ ప్రికాషన్స్ పాటించలేదు. ఘటన ఎలా జరిగింది ప్రమాదం కారణాలపై దర్యాప్తు చేస్తున్నాము"- శ్రీనివాస్, అగ్నిమాపక అధికారి

ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు : 'పెయింట్లకు సంబంధించిన గోదాంలో అగ్నిప్రమాదం జరిగిందని మాకు సమాచారమందింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశాము. అగ్నిప్రమాదం ఏవిధంగా జరిగిందనేది దర్యాప్తులో ఇంకా తేలాల్సి ఉంది. స్థానికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు' అని ఉప్పల్​ ఏసీపీ చక్రపాణి తెలిపారు.

'ప్రమాదం జరిగిన సమయంలో గోదాంలో వర్కర్లు ఎవరూ లేరు. గోదాం బయట సెక్యూరిటీ సిబ్బంది మాత్రమే ఇద్దరు ఉన్నారు. ప్రమాదాన్ని గమనించిన వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చాము. మంటలను ఆర్పేందుకు ప్రయత్నించాము' అని రమేశ్ అనే స్థానికుడు తెలిపారు. అగ్నిప్రమాదాల నివారణకు ప్రభుత్వం ఎన్నిచర్యలు చేపట్టినప్పటికీ ఎక్కడో ఓ చోట ఇలాంటి ఘటనలు జరగడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తుంది. కొన్ని పరిశ్రమలు అగ్నిమాపక నిబంధనలు పాటించకపోవడం వల్లే తరచూ ఇలాంటి ప్రమాదాలు తలెత్తుతున్నాయి.

ఫర్నీచర్ దుకాణంలో అగ్నిప్రమాదం - మంటలను అదుపుచేసిన ఫైర్ సిబ్బంది - Fire Break Out In Furniture shop

వరంగల్​లో భారీ అగ్ని ప్రమాదం - ఫర్నిచర్ షాపులో చెలరేగిన మంటలు - Fire accident in warangal

Last Updated : Sep 7, 2024, 10:54 PM IST

ABOUT THE AUTHOR

...view details