Manchu Vishnu on Manchu Family Dispute :తమనివాసంలో జరిగిన ఘర్షణలో రిపోర్టర్‌పై దాడి జరగడం దురదృష్టకరమని మంచు విష్ణు అన్నారు. గత రెండు రోజులుగా తమ కుటుంబంలో జరుగుతున్న వివాదంపై మంచు విష్ణు స్పందించారు. ప్రతి కుటుంబంలో గొడవలు ఉంటాయని, తమ ఇంట్లో గొడవ (Manchu Family Fight)ను పెద్దదిగా చేసి చూపించవద్దని మంచు విజ్ఞప్తి చేశారు. సమస్య పరిష్కారం కోసం పెద్దలు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. సమస్య సామరస్యంగా పరిష్కారం అవుతుందని ఆశిస్తున్నానని అన్నారు. ఎవరైనా ప్రేమతో గెలవాలని, రచ్చతో కాదని తెలిపారు. ఈ వివాదం తమ మనసులను ఎంతో బాధపెడుతోందని పేర్కొన్నారు. తమను విపరీతంగా ప్రేమించడమే తన నాన్న చేసిన తప్పు అని వ్యాఖ్యానించారు.
అలా జరిగి ఉండకూడదు : ఘర్షణలో మీడియా ప్రతినిధికి గాయాలు కావడం దురదృష్టకరమని మంచు విష్ణు అన్నారు. మంగళవారం జరిగిన ఘటన ఉద్దేశపూర్వకంగా జరిగిన దాడి కాదని, మోహన్‌బాబు నమస్కరిస్తూనే మీడియా ముందుకు వచ్చారని, మొహం మీద మైకు పెట్టడంతో క్షణికావేశంలో కొట్టారని, అలా జరిగి ఉండకూడదని పేర్కొన్నారు. ఆ ఘర్షణలో మోహన్ బాబుకు కూడా కొన్ని గాయాలయ్యాయని తెలిపారు. గాయపడిన జర్నలిస్టు కుటుంబ సభ్యులతో మాట్లాడానని, తాను లేని నాలుగైదు రోజుల్లోనే గొడవలు జరిగిపోయాయని చెప్పారు.
సీపీని కలవాల్సిన అవసరం లేదు : కన్నప్ప సినిమా పోస్టు ప్రొడక్షన్ పని మీద లాస్ఏంజెల్స్లో ఉండగా ఫోన్ వచ్చిందని, దీంతో వెంటనే అమెరికా నుంచి వచ్చేశానని విష్ణు తెలిపారు. సమస్య సామరస్యంగా పరిష్కారం అవుతుందని ఆశిస్తున్నానని వ్యాఖ్యానించారు. పోలీసుల నోటీసులు తమకు రాకముందే మీడియాకు లీక్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. గన్ సరెండర్ చేయాలని మంగళవారమే ఆదేశించినట్లు మీడియాలో వచ్చిందని అన్నారు. గన్ సరెండర్‌పై ఇవాళ ఉదయం 10.30 గంటలకు తనకు నోటీసులు ఇచ్చారని తెలిపారు.
"నేను ఇంటికి వెళ్లడానికి అదొక్కటే కారణం - నా భార్య తల్లిదండ్రులు ఉండుంటే ఊరుకునేవారా?"