తెలంగాణ

telangana

ETV Bharat / state

'నిజం ఎప్పటికైనా బయటపడుతుంది' : జానీ మాస్టర్ వ్యవహారంపై మనోజ్ కీలక వ్యాఖ్యలు - Manchu Manoj Reacts On Jani Master - MANCHU MANOJ REACTS ON JANI MASTER

Manchu Manoj On Jani Master Controversy : కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్​పై లైంగిక వేధింపుల ఆరోపణల వ్యవహారం రాష్ట్రంలో సంచలనం రేపుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ అంశంపై హీరో మంచు మనోజ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే?

Manchu Manoj On Jani Master Controversy
Manchu Manoj On Jani Master Controversy (ETV Bharat)

By ETV Bharat Entertainment Team

Published : Sep 19, 2024, 5:18 PM IST

Manchu Manoj On Jani Master Controversy :డ్యాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్​పై లైంగిక వేధింపుల ఆరోపణల వ్యవహారంపై తాజాగా హీరో మంచు మనోజ్ 'ఎక్స్' వేదికగా స్పందించారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో ఈ విధంగా రాసుకొచ్చారు. "జానీ మాస్టర్.. కెరీర్ పరంగా ఈ స్థాయికి వచ్చేందుకు మీరు ఎంతగా శ్రమించారో అందరికీ తెలుసు. కానీ ఈ రోజు మీపై తీవ్ర ఆరోపణలు రావడం చూస్తుంటే నా హృదయం బద్దలైపోతుంది. నిజం ఎప్పటికైనా బయటికొస్తుంది. ఈ విషయంలో ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు అనేది చట్టమే నిర్ణయిస్తుంది. ఒక యువతి తన స్వరాన్ని వినిపించినప్పుడు పారిపోవడం అనేది సమాజానికి, భవిష్యత్ తరాలకు ఒక ప్రమాదకరమైన సందేశాన్నిస్తుంది" అని పోస్ట్ చేశారు.

"లైంగిక వేధింపుల కేసు విషయంలో వెంటనే స్పందించి చర్యలు తీసుకున్న హైదరాబాద్ సిటీ పోలీస్, బెంగళూరు నగర పోలీసులకు నా అభినందనలు. చట్టానికి ఎవరూ అతీతులు కారు అనే విషయాన్ని ఇది తెలియజేస్తుంది. జానీ మాస్టర్ నిజాన్ని ఎదుర్కోండి. మీరు ఎలాంటి తప్పు చేయకపోతే పోరాటం చేయండి. మీరు దోషి అయితే ఆ విషయాన్ని అంగీకరించండి"- మంచు మనోజ్ ఎక్స్ పోస్ట్

మహిళా ప్రొటెక్షన్ సెల్ వెంటనే ఏర్పాటు చేయండి :'ఇచ్చిన మాట ప్రకారం మహిళా ప్రొటెక్షన్ సెల్​ను వెంటనే సిద్ధం చేయాలని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్​ను కోరుతున్నా. అందుకోసం ప్రత్యేకంగా సోషల్​మీడియా అకౌంట్లు ఏర్పాటు చేయండి. మన సినీ పరిశ్రమలోని మహిళలకు గళంగా నిలవండి. తాము ఒంటరిగా లేమని తమ బాధలకు వింటామనే విషయాన్ని ప్రతి మహిళకు తెలపండి. ఈ క్లిష్ట పరిస్థితుల్లో అండగా నిలబడిన మన సినీ పరిశ్రమలోని పెద్దలు, సహోద్యోగులకు నా మద్దతును తెలియజేస్తున్నా. న్యాయం, గౌరవం అనేవి మాటల్లోనే కాకుండా చేతల్లోనూ చూపించే విధంగా సమాజాన్ని నిర్మిద్దాం. కుమార్తె, సోదరి, తల్లి ఇలా ప్రతి మహిళ కోసం ఈ పోరాటం. వారికి అన్యాయం జరగకుండా చూద్దాం' అని మంచు మనోజ్ తన ఎక్స్ పోస్టు ద్వారా కోరారు.

అసలేంటీ వివాదం :ప్రముఖ కొరియోగ్రాఫరైనజానీ మాస్టర్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, అత్యాచారం చేశాడంటూ ఓ లేడీ డ్యాన్సర్‌ రెండు రోజుల క్రితం పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. జానీ మాస్టర్‌పై రాయదుర్గం పోలీస్​స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులు జీరో ఎఫ్​ఐఆర్ నమోదు చేశారు. అనంతరం కేసును నార్సింగి పీఎస్‌కు బదిలీ చేశారు. కాగా ఈ ఘటనపై నార్సింగి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నార్సింగి పీఎస్‌లో 372(2) (N), 506, 323 ఐపీసీ సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

అసిస్టెంట్​పై అత్యాచారం - గోవాలో జానీ మాస్టర్ అరెస్టు - JANI MASTER ARRESTED TODAY

జానీ మాస్టర్​ కేసులో కొత్త ట్విస్ట్ - పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు - Joni Master rape case Latest News

ABOUT THE AUTHOR

...view details