తెలంగాణ

telangana

ETV Bharat / state

'జనరేటర్‌లో పంచదార పోయించి, విద్యుత్తు సరఫరా నిలిపివేశారు' - మంచు ఫ్యామిలీలో మళ్లీ వివాదం! - MANCHU MANOJ ALLEGATIONS ON VISHNU

మంచు కుటుంబంలో మరో వివాదం తెరపైకి - శనివారం తన ఫ్యామిలీలో చోటుచేసుకున్న ఘటన గురించి ఒక ప్రకటన విడుదల చేసిన మంచు మనోజ్

Manchu Manoj Allegations On Vishnu
Manchu Manoj Allegations On Vishnu (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : 5 hours ago

Manchu Manoj Allegations On Vishnu :మంచు ఫ్యామిలీలో వివాదం ముగియలేదు. తాజాగా మరో వివాదం తెరపైకి వచ్చింది. మంచు మనోజ్‌ తాజా స్టేట్‌మెంటే అందుకు నిదర్శనం. శనివారం తన కుటుంబంలో చోటుచేసుకున్న ఘటన గురించి ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. మంచు విష్ణు తన ఇంటి వద్ద జనరేటర్‌లో పంచదార పోయించి, విద్యుత్తు సరఫరా నిలిపివేశారని మనోజ్​ ఆరోపించారు.

'నిన్న నేను సినిమా షూటింగ్​లో ఉన్నాను. కుమారుడి పాఠశాలలో ఈవెంట్‌కు నా భార్య హాజరైంది. మా అమ్మ బర్త్​డే సందర్భంగా కేకు ఇచ్చే నెపంతో నా సోదరుడు మంచు విష్ణు తన అనుచరులు రాజ్‌ కొండూరు, కిరణ్‌, విజయ్‌ రెడ్డిలతోపాటు కొందరు బౌన్సర్లతో ఇంట్లోకి ప్రవేశించాడు. జనరేటర్లలో షుగర్‌(పంచదార) పోయించాడు. దాంతో, ఇంటికి రాత్రి విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడింది. దీంతో మేమంతా ఆందోళనకు గురయ్యాము. ఇంట్లో అమ్మ, 9 నెలల కుమార్తె, కుమారుడు, అత్తమామలు ఉన్నారు. ఈ చర్యతో అగ్ని ప్రమాదం(ఫైర్​) సంభవించే అవకాశం ఉంది. జనరేటర్లకు సమీపంలో వెహికిల్స్​ పార్క్‌ చేసి ఉన్నాయి. అక్కడే గ్యాస్‌ కనెక్షన్‌ కూడా ఉందని' మనోజ్​ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.

ఇలా జరగడం హృదయాన్ని కలచివేసింది : మంచు విష్ణు టీమ్‌ ఇంటి నుంచి వెళ్లిపోతూ నా వద్ద పనిచేసే వారిని అక్కడ నుంచి పంపించివేసిందని మంచు మనోజ్​ ఆరోపించారు. తన దంగల్‌ కోచ్‌ను కూడా బెదిరించిందన్నారు. అమ్మ పుట్టినరోజున ఇలా జరగడం హృదయాన్ని కలచివేసిందని మనోజ్​ ఆవేదన వ్యక్తం చేశారు.

'నేను, నా కుటుంబం భయం భయంతో బతుకుతున్నాం. దీనిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నాను. న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను' అని మనోజ్‌ తన ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఘటనపై పహాడీషరీఫ్‌ ఠాణాకు వెళ్లి మనోజ్‌ ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం.

'మా నాన్నను అన్న విష్ణు, వినయ్​ ట్రాప్​ చేశారు - ఆయన దృష్టిలో నన్ను శత్రువుగా చిత్రీకరించారు'

మంచు ఫ్యామిలీలో తారాస్థాయికి చేరిన వివాాదాలు - ప్రాణహాని ఉందని అదనపు డీజీపీకి మనోజ్ దంపతుల ఫిర్యాదు

ABOUT THE AUTHOR

...view details