తెలంగాణ

telangana

ETV Bharat / state

మొహర్రం వేడుకల్లో అపశ్రుతి - పులివేషం వేసి నృత్యం చేస్తున్న యువకుడు గుండెపోటుతో మృతి - Sudden Death Of A Young Man - SUDDEN DEATH OF A YOUNG MAN

Sudden Death Of A Young Man : జగిత్యాల జిల్లా మాల్యాల మొహర్రం వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. అప్పటి వరకూ అందరితో కలిసి ఆనందంగా వేడుకల్లో పాల్గొని నృత్యం చేస్తున్న ఓ యువకుడు హఠాత్తుగా కుప్పకూలి ప్రాణాలు విడిచాడు. మొహర్రం వేడుకల సందర్భంగా పులి వేషాలు వేసి నృత్యం చేస్తున్న క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

Sudden Death Of A Young Man
Sudden Death Of A Young Man (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jul 15, 2024, 8:01 AM IST

Updated : Jul 15, 2024, 8:29 AM IST

Sudden Death Of A Young Man in Jagital District :ఓ యువకుడు పులివేషం నృత్యం చేస్తూ ఉన్నట్టుండి గుండెపోటుతో కుప్పకూలిపోయి మృతి చెందిన విషాద ఘటన జగిత్యాల జిల్లా మాల్యాల గ్రామంలో జరిగింది. అక్కడే ఉన్న తోటి యువకుడు అతనికి సీపీఆర్​ చేసి ఆసుపత్రికి తరలించిన అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. యువకుడి ఆకస్మిక మరణంతో ఒక్కసారిగా గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.

ఇదీ జరిగింది మొహర్రం వేడుకలను జగిత్యాల ప్రాంతంలోని మాల్యాల గ్రామంలో నిర్వహించారు. ఈ వేడుకల్లో పులివేషాలు వేయడం ఆనవాయితీగా వస్తోంది. అయితే యువకులంతా కలిసి పులివేషాలు వేశారు. 23 ఏళ్ల లక్ష్మణ్ కూడా పులివేషాన్ని ధరించి నృత్యం చేశాడు. ఈ క్రమంలో ఏం జరిగిందో ఏమో కానీ ఉన్నట్టుండి అతడు ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలి పోయాడు. దీంతో వెంటనే తన తోటి యువకులు వెంటనే అంబులెన్స్​కు సమాచారం అందించారు. 108 అంబులెన్స్​ అక్కడి చేరుకొని ఆసుపత్రికి తరలించారు. అంబులెన్స్​లోనే సిబ్బంది సీపీఆర్​ చేశారు. పరీక్షించిన వైద్యులు యువకుడు మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో ఒక్కసారిగా ఆ యువకుడి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Last Updated : Jul 15, 2024, 8:29 AM IST

ABOUT THE AUTHOR

...view details