తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఇగో' తీసిన ప్రాణం : హారన్​ కొడితే అవమానంగా ఫీలయ్యాడు - లారీకి ఎదురెళ్లి ప్రాణాలు కోల్పోయాడు - LORRY HITS MAN IN KHAMMAM DISTRICT

సైడ్​ ఇవ్వాలంటూ లారీ డ్రైవర్​ హారన్​ కొట్టినందుకు ఆగ్రహానికి గురైన ద్విచక్ర వాహనదారుడు - డ్రైవర్​తో గొడవ పడి వాహనానికి ఎదురు వెళ్లి ఆపే ప్రయత్నంలో ఢీకొట్టిన లారీ - అక్కడికక్కడే మృతి

MAN DIE AFTER LORRY HITS IN KHAMMAM
Man Dies after Lorry hits in Khammam (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Nov 14, 2024, 2:11 PM IST

Man Dies after Lorry hits in Khammam :తాను ద్విచక్ర వాహనంపై వెళ్తున్న క్రమంలో వెనక నుంచి వస్తున్న లారీ డ్రైవర్​ సైడ్​ కోసం హారన్​ కొట్టడాన్ని అవమానంగా భావించిన ఓ వ్యక్తి, ఆ లారీని ఆపే ప్రయత్నంలో అదే లారీని ఢీకొని మృత్యుఒడికి చేరుకున్న ఘటన ఇది. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం కృష్ణాపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కల్లూరు మండలం ఎర్ర బోయినపల్లి గ్రామానికి చెందిన కొలికపూడి సోమయ్య (32) అనే వ్యక్తి ద్విచక్ర వాహనంపై వైరా నుంచి బోనకల్ మండలం రాపల్లి గ్రామంలో బంధువుల ఇంట్లో వేడుకకు హాజరయ్యేందుకు బయల్దేరాడు.

ఈ క్రమంలో గొల్లపూడి ప్రాంతంలో వెనక నుంచి వస్తున్న లారీ డ్రైవర్ సైడ్ కోసం రెండు మూడు సార్లు హారన్ కొట్టాడు. దీనిని అవమానంగా భావించిన సోమయ్య లారీని ఆపి డ్రైవర్​తో వాదనకు దిగాడు. ఈ క్రమంలో లారీ డ్రైవర్​ ముందుకు వెళ్లడంతో ఆగ్రహానికి గురైన సోమయ్య, లారీని వెంబడిస్తూ సిరిపురం గ్రామంలో డ్రైవర్​తో గొడవపడ్డాడు. ఈ నేపథ్యంలో లారీ డ్రైవర్​ తప్పయిందంటూ వెళ్లిపోతుండగా మళ్లీ తన ద్విచక్ర వాహనంతో సోమయ్య కృష్ణాపురం గ్రామం వద్దకు చేరుకొని బైక్​ను పక్కన పెట్టి లారీని ఆపేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఎదురు వెళ్లిన సోమయ్యను లారీ ఢీకొట్టింది. దీంతో సోమయ్య అక్కడికక్కడే తీవ్ర రక్తస్రావంతో మృతి చెందాడు.

హత్యగా కేసు నమోదు చేసిన పోలీసులు : ప్రత్యక్ష సాక్షి సమాచారం మేరకు రోడ్డు ప్రమాదం గురించి తెలుసుకున్న రూరల్ పోలీసులు, ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. అనంతరం హత్యగా కేసు నమోదు చేశారు. ప్రత్యక్ష సాక్షి ఇచ్చిన లారీ నంబర్ ఆధారంగా ఎర్రుపాలెం మండలం ఇనగాలి గ్రామానికి చెందిన లారీగా, విజయవాడకు చెందిన రామిశెట్టి దుర్గారావు లారీ డ్రైవర్​గా పోలీసులు గుర్తించారు. ప్రమాదానికి సంబంధించి మృతుడు వ్యవహరించిన తీరు, అతను లారీ డ్రైవర్ పట్ల వ్యవహరించిన దురుసు ప్రవర్తన, తాను మృత్యు ఒడిలోకి చేరేందుకు తనకు తానుగానే ప్రమాదాన్ని కొనితెచ్చుకున్నట్లు వెల్లడైంది. మృతి చెందిన వ్యక్తి ఖమ్మంలో ఫిజియోథెరపిస్ట్​గా పని చేస్తున్నాడని తెలిసింది.

కుమార్తెకు జన్మనిచ్చిన భార్య - యాక్సిడెంట్​లో చనిపోయి అదే ఆసుపత్రి మార్చురీలో భర్త

అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - లారీని ఢీకొన్న కారు - ఆరుగురు మృతి

ABOUT THE AUTHOR

...view details