తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రమాదం చూసొస్తానంటూ వెళ్తే ప్రాణమే పోయింది - భార్య వెళ్లొద్దని హెచ్చరించినా - MAN DIED IN FIRE ACCIDENT

పూరింట్లో పేలిన గ్యాస్‌ సిలిండర్‌ - ప్రమాదం చూడటానికి వెళ్లిన ఓ వ్యక్తి మృతి - మరో ముగ్గురికి గాయాలు

FIRE ACCIDENT IN GUNTUR
Man Dies After Explode Gas Cylinder hits him (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Nov 25, 2024, 7:31 AM IST

Man Dies After Explode Gas Cylinder hits him : విధి ఎంత విచిత్రమో. అగ్ని ప్రమాదం జరిగిన ఇంట్లో వ్యక్తులు సురక్షితంగా ఉండగా ప్రమాదం చూస్తానికి వెళ్లిన వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన ఘటన ఇది. ఇంట్లో అగ్నిప్రమాదం జరిగి మూడు గ్యాస్​ సిలిండర్లు పేలగా అదృష్టవశాత్తు ఆ ఇంట్లో వారందరూ ఆ సమయంలో గుడికి వెళ్లారు. కానీ చూడటానికి వచ్చిన ఓ వ్యక్తికి సిలిండర్​ లోహపు ముక్క తగిలి మృతి చెందారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గుంటూరు జిల్లా పెదకాకాని మండలం వెంకటకృష్ణాపురానికి చెందిన అమ్మిశెట్టి శ్రీనివాసరావు, భార్య, కుమార్తె సుజాత కుటుంబాలు ఒకే పూరిగుడిసెలో రెండు భాగాల్లో ఉంటున్నారు.

ఈ నెల 24న(ఆదివారం) ఇంట్లో దీపాలు వెలిగించి కుటుంబమంతా గ్రామ శివారులోని నాగేంద్రస్వామి పుట్ట వద్దకు వెళ్లారు. అదేరోజు ఉదయం పూరింట్లో మంటలు వ్యాపించి రెండు సిలిండర్లు పేలాయి. ఆ సమయంలో అగ్నిప్రమాదం జరిగిన ఇంటికి గ్రామానికి చెందిన రైతు అమ్మిశెట్టి తులసీనాథ్‌ (37), వీరాంజనేయులు, గుంటముక్కల పరమేశ్​, మల్లికార్జునరావు వెళ్లారు. ఈ క్రమంలో ఇంట్లోని మూడో సిలిండర్​ పేలి దాని లోహపు ముక్కలు నలుగురిపై పడి గాయాలయ్యాయి. దీంతో స్థానికులు ఆ నలుగురిని వెంటనే గుంటూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తులసీనాథ్‌ తలకు తీవ్రగాయాలవ్వడంతో చికిత్స పొందుతూ మృతి చెందారు. అగ్నిమాపక శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పారు.

భార్య వెళ్లొద్దని చెప్పినా : పొలానికి వెళ్లి గడ్డి మందు పిచికారి చేసి వచ్చిన అమ్మిశెట్టి తులసీనాథ్‌, అగ్నిప్రమాదం జరిగిన ప్రాంతానికి కొంత దూరంలోని తన అత్త ఇంటికి వెళ్లి అక్కడే ఉన్న భార్య, పిల్లల దగ్గరకు వెళ్లారు. వెంటనే ఇంట్లోని కరెంట్​ సరఫరా నిలిపివేసి, గ్యాస్​ సిలిండర్​ రెగ్యులేటర్​ తొలగించారు. ఈ నేపథ్యంలో అగ్నిప్రమాదం జరిగిన ఇంటికి తులసీనాథ్‌ వెళ్తుండగా భార్య లక్ష్మీ తిరుపతమ్మ వెళ్లొద్దని చెప్పింది. దూరంగా ఉండి చూసి వస్తానంటూ తులసీనాథ్‌ వెళ్లిన కొద్దిసేపటికే మూడో సిలిండర్​ పేలి దాని ముక్కలు ఆయన తలకు బలంగా తగిలింది. దీంతో రక్తస్రావంతో పడిపోయిన భర్త తులసీనాథ్‌ను చూసి భార్య కన్నీరుమున్నీరుగా విలపించారు. ఆయనకు కుమారుడు, కుమార్తె ఉన్నారు.

గ్యాస్‌ సిలిండర్‌ పేలి తులసీనాథ్‌ తలకు తగిలిన లోహపు ముక్క (ETV Bharat)

అమ్మిశెట్టి శ్రీనివాసరావు ఇంటి నిర్మాణం కోసం ఇటీవల చిట్టీ పాడిన నగదు, భార్యకు డ్వాక్రాలో వచ్చిన నగదు మొత్తం 5 లక్షల రూపాయలు బీరువాలో దాచారు. ఇంట్లోని అగ్నిప్రమాదం జరగగా బీరువాలోని నగదు కాలి బూడిదైంది.

హైదరాబాద్​లో మరో అగ్నిప్రమాదం - బాణసంచా పేలి దంపతులు మృతి

ఉపాధి కల్పించేవే ఊపిరితీశాయి - విద్యుదాఘాతంతో ఊపిరాడక ఏడేళ్ల బాలుడి మృతి - Boy Died at Home by Short Circuit

ABOUT THE AUTHOR

...view details