ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

హైదరాబాద్‌లో భారీ వర్షం - అవసరమైతే తప్ప బయటకు రావద్దన్న జీహెచ్​ఎంసీ - RAINS IN HYDERABAD - RAINS IN HYDERABAD

Weather Update : హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఒక్కసారిగా వరుణుడు పలకరించడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరో 2 గంటల్లో నగరంతో పాటు పలు జిల్లాల్లోనూ ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Heavy Rains in AP
Heavy Rain in Hyderabad (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 24, 2024, 5:21 PM IST

Updated : Sep 24, 2024, 10:22 PM IST

Heavy Rains in AP : బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని విశాఖ వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్‌ తెలిపారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, వాయవ్య బంగాళాఖాతాన్ని ఆనుకుని ఈ అల్పపీడనం ఉందని అన్నారు. ఈ ప్రభావంతో 24 గంటల్లో కోస్తాంధ్రలో ఒకట్రెండు చోట్ల భారీ, చాలాచోట్ల వర్షం కురుస్తుందని తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.

ఎడతెరిపి లేని వర్షానికి కడపలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కడప RTC బస్టాండు ప్రాంగణం చిన్నపాటి చెరువును తలపిస్తోంది. బస్సులు పార్కింగ్ చేసే ప్రాంతమంతా వాన నీటితో నిండింది. బస్సులు ఎక్కి, దిగడానికి ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. ప్రయాణికులు నీటిలోనే నడుచుకుంటూ బస్సుల వద్దకు వెళ్లాల్సి వచ్చింది. కడప నగరంలోని భాగ్యనగర్ కాలనీ, వాసవి నగర్, కోర్టు రోడ్డు, అంబేడ్కర్ సర్కిల్, మృత్యుంజయ కుంట, ప్రకాష్ నగర్ తదితర కాలనీలలోని రోడ్లపై వాన నీరు నిలిచింది.

కాకినాడ జిల్లా తునిలో ఎడతెరిపి లేకుండా సుమారు గంటపాటు భారీ వర్షం కురిసింది. కుండపోత వర్షానికి పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. పట్టణంలోని నారాయణ రాజు వీధి, పోలీస్ క్వార్టర్స్ రోడ్డు, ఆంజనేయస్వామి ఆలయ ప్రాంగణం తదితర ప్రాంతాల్లోని రహదారులు నీట మునిగాయి. రహదారులపై భారీగా వర్షపు నీరు రావడంతో వాహనాదారులు తీవ్ర అవస్థలు పడ్డారు. పలు ప్రాంతాల్లో డ్రైనేజీలు పొంగి పొర్లడటంతో మురికి నీరు రోడ్లపై ప్రవహిస్తోంది. ఏకధాటిగా వర్షం కురవడంతో తోపుడుబండ్ల వ్యాపారస్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

Heavy Rain in Hyderabad: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. నగరంలోని సుచిత్ర, గుండ్లపోచంపల్లి, బహదూర్‌పల్లి, సూరారం, కొంపల్లి, చింతల్‌, కండ్లకోయ, కృష్ణాపూర్, దుండిగల్, గాగిల్లాపూర్, గౌడవల్లి, మునీరాబాద్, డబిల్‌పూర్‌లలో ఒక్కసారిగా కురిసిన వర్షంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలుచోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడగా, పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితులను చక్కదిద్దుతున్నారు.

హైదరాబాద్‌లో భారీ వర్షం (ETV Bharat)

4 రోజుల పాటు భారీ వర్షాలు : ఇదిలా ఉండగా రాష్ట్రంలో రానున్న 4 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. బుధవారం గంటకు 40 నుంచి 50 కి.మీ, గురువారం 30 నుంచి 40 కి.మీ వేగంతో అక్కడక్కడ గాలులు వీచే అవకాశం ఉందని ప్రకటించింది. మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉత్తరాంధ్ర - దక్షిణ ఒడిశా తీరం వద్ద పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాని పరిసర వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని పేర్కొంది.

ఏపీలో బుల్డోజర్ల హవా - మచిలీపట్నంలో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం - Demolition Houses in Machilipatnam

మరో 2 గంటల్లో భాగ్యనగరంలో భారీ వర్షం : మరో 2 గంటల్లో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. సిద్దిపేట, కరీంనగర్‌, కామారెడ్డి, మెదక్‌, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, వికారాబాద్‌, సంగారెడ్డి జిల్లాల్లో వచ్చే 2-3 గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది.

రాజమహేంద్రవరంలో బుల్డోజర్లు - 21 ప్రాంతాల్లో 128 అక్రమ కట్టడాలే టార్గెట్ - Encroachments in Rajamahendravaram

సనాతన ధర్మం జోలికొస్తే ఊరుకునేది లేదు : పవన్ కల్యాణ్ - Pawan Kalyan Visits Indrakeeladri

Last Updated : Sep 24, 2024, 10:22 PM IST

ABOUT THE AUTHOR

...view details