తెలంగాణ

telangana

ETV Bharat / state

మందుబాబులకు పిడుగులాంటి వార్త - జులైలో రెండు రోజులు మద్యం దుకాణాలు బంద్! - Liquor Stores Close in Telangana

Liquor Stores Close in Telangana: రాష్ట్రంలో మందుబాబులకు మళ్లీ బ్యాడ్ న్యూస్. జులైలో కూడా రెండు రోజుల పాటు మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. అయితే, ఎందుకు? ఎప్పుడు? అనే పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

By ETV Bharat Telangana Team

Published : Jul 7, 2024, 11:13 AM IST

Liquor Stores Close in Hyderabad
Liquor Stores Close in Telangana (ETV Bharat)

Liquor Shops Close in Hyderabad:మద్యం లవర్స్​కు బ్యాడ్ న్యూస్. ఇప్పటికే రాష్ట్రంలో లోకసభ ఎన్నికలు, ఎమ్మెల్సీ ఉపఎన్నిక నేపథ్యంలో.. ఏప్రిల్, మే, జూన్ నెలలోని పలు తేదీల్లో మద్యం దుకాణాలు మూతపడిన విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు జులైలో కూడా మరోసారి మద్యం(Alcohol) దుకాణాలు బంద్​ కానున్నాయి. మరి.. ఎందుకు మళ్లీ మద్యం దుకాణాలు మూసేయబోతున్నారు? అది ఎప్పుడు? ఎక్కడ? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ఏప్రిల్​ నెలలో శ్రీరామనవమి, హనుమాన్ జయంతి సందర్భంగా.. రెండు రోజులు వైన్స్ షాపులు మూతపడిన విషయం తెలిసిందే. అదే విధంగా.. మే నెలలో లోక్​సభ ఎన్నికల సందర్భంగా రెండు రోజులు, నల్గొండ-ఖమ్మం-వరంగల్ జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్​ కారణంగా మరో రెండు రోజులు.. మొత్తంగా మే నెలలో నాలుగు రోజులు మద్యం దుకాణాలు మూతపడ్డాయి. ఇక లోక్​సభ ఎన్నికల ఫలితాల సందర్భంగా గత నెల జూన్​ 4న అన్ని మద్యం దుకాణాలు బంద్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు.. తాజాగా జులైలో కూడా మరో రెండు రోజులు మద్యం దుకాణాల బంద్ కొనసాగనుంది.

అలర్ట్ : మందులో కూల్​​డ్రింక్ మిక్స్ చేస్తున్నారా? మీ శరీరంలో జరిగే మార్పులివే!

ముఖ్యంగా జంట నగరాల పరిధిలోని మద్యం దుకాణాలు మూతపడనున్నట్లు సమాచారం. అది ఎప్పుడెప్పుడంటే.. ముస్లింలు పవిత్రంగా జరుపుకునే మొహరం పండగ రోజు అంటే.. జులై 17వ తేదీన మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. అలాగే.. భాగ్యనగరంలో ఎంతో వైభవంగా నిర్వహించే బోనాల పండగ దృష్ట్యా జులై 21న మరో రోజు మద్యం దుకాణాలు మూతపడనున్నట్లు తెలుస్తోంది. ఈ తేదీన కూడా హైదరాబాద్​ నగరంలోని పలు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో వైన్స్ మూతపడనున్నాయి. దీనిని బట్టి చూస్తే జులైలో కూడా రెండు రోజులు డ్రై డేగా ఉండనుందనే విషయాన్ని మద్యం ప్రియులు గమనించాలి.

ఎందుకంటే.. జులైలో ఈ రెండు రోజులు బార్లు, లిక్కర్ షాపులు మూతపడనున్నాయి. అయితే, భాగ్యనగరంలో బోనాల పండగ దృష్ట్యా ఏ ఏ ప్రాంతాల్లో మద్యం దుకాణాలు ఎప్పుడు క్లోజ్ అవుతాయనే విషయంపై ఎక్సైజ్ శాఖ నుంచి ఇంకా ఆదేశాలు రావాల్సి ఉంది. కాబట్టి, మందుబాబులు ఈ విషయాన్ని గమనించి.. తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. అలాకాకుండా.. డ్రై డే రోజు మద్యం కొనుగోలు చేస్తే పోలీసుల నుంచి కఠిన చర్యలు ఎదుర్కొవాల్సి ఉంటుందనే విషయాన్ని మందు బాబులు దృష్టిలో ఉంచుకోవాలి.

మందు తాగాక వాంతులు అయ్యేది ఇందుకే! - పరిశోధనలో ఆశ్చర్యపోయే విషయాలు!

ABOUT THE AUTHOR

...view details