PM Kisan E KYC : ఏపీలో ప్రభుత్వ పథకాలన్నీ ఆధార్‌తో అనుసంధానం చేస్తూ ఈ-కేవైసీ (ఆధార్ కార్డుకు ఫోన్ నంబర్ లింక్) తప్పనిసరి చేశారు. రైతులకు ప్రభుత్వ పథకాలు వర్తించాలంటే ఈ-కేవైసీ తప్పనిసరి చేశారు. ఈ-పంట, పీఎం కిసాన్ నమోదుకు ఈకేవైసీ తప్పనిసరి చేయడంతో ఈ ప్రక్రియ గ్రామస్థాయిలోని రైతు సేవా కేంద్రాల్లో మొదలైంది. రైతులు ఈ-కేవైసీ పూర్తి చేయాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. ఏటా మూడు సార్లు నిధులు అందించే పీఎం కిసాన్ పథకానికి ఈ-కేవైసీ చేసుకునే ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. ఈ-పంట నమోదు సమయంలో ఈ-కేవైసీనే ప్రామాణికంగా తీసుకుంటారని వ్యవసాయాధికారులు చెబుతున్నారు.
కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ పథకం (పీఎం కిసాన్) ద్వారా భూమి కలిగిన ప్రతి రైతుకు ఆర్థిక సాయం అందిస్తోంది. అర్హులైన రైతులకు ఏటా మూడు విడతల్లో రూ.2 వేల చొప్పున నాలుగు నెలలకొకసారి నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తోంది. ఈ నేపథ్యంలో రైతులు పీఎం కిసాన్ కింద ఆర్థిక సాయం పొందాలంటే ఈ-కేవైసీ చేసుకోవాల్సి ఉంటుంది. గ్రామస్థాయిలో రైతు సేవా కేంద్రాల్లో ఈ-కేవైసీ ప్రక్రియ కొనసాగుతోంది. రైతులు భూమి పాసుపుస్తకం, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఫోన్ నంబరు నమోదు చేయించాలి. ఆ పత్రాలన్నీ సిబ్బందికి అందజేస్తే రిజిస్టర్ చేసి రైతుల వేలిముద్ర సేకరిస్తారు.
రైతులకు గుడ్ న్యూస్ - "పీఎం కిసాన్" డబ్బులు అకౌంట్లో పడ్డాయి! - ఇలా చెక్ చేయండి! - How to Check PM Kisan Status
ఇదిలా ఉండగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కోసం రైతులు ఈకేవైసీ సమర్పించాలన్న లక్ష్యం వ్యవసాయశాఖ అధికారులకు ఇబ్బందిగా మారింది. రైతుల్లో అవగాహన లేమి కారణంగా నూరు శాతం లక్ష్యం చేరడం లేదు. అక్కడక్కడా సాంకేతిక లోపాలు, క్షేత్రస్థాయి పరిస్థితులు కేంద్ర సర్కార్ నిర్ధేశించిన లక్ష్యానికి దూరం చేస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఈకేవైసీ పూర్తికావాలంటే కేంద్రం డబ్బులు జమ చేసే బ్యాంకు ఖాతా, ఆధార్ నంబర్‌తో అనుసంధానమై ఉండాలి. ముందుగా రైతులు ఆధార్, ఫోన్ నంబర్‌ను అనుసంధానం చేయించాల్సి ఉంటుంది. ఈ కేవైసీ చేయించే క్రమంలో సంబంధిత ఫోన్ నంబర్‌కే ఓటీపీ వస్తుంది. అన్ని పత్రాలకు తోడు ఫోన్ నంబర్ అనుసంధానం చేసుకుంటేనే ఈ కేవైసీ పూర్తవుతుంది.
ఈ కేవైసీ పూర్తి చేయించకపోవడానికి ఫోన్ నంబర్ సమస్యగా మారుతోంది. చాలా మందికి పర్మినెంట్ ఫోన్ నంబర్ లేకపోవడంతో ఈ కేవైసీ ఆలస్యమవుతోంది. మీ-సేవా కేంద్రాలు, కామన్ సర్వీస్ సెంటర్ వద్దకు వెళ్లిన వారు ఫోన్ నంబర్ సమస్యతో నిరాశతో వెనుదిరగాల్సి వస్తోంది. గతంలో ఉపయోగించిన ఫోన్ నంబర్ వారివద్ద లేకపోవడం, ఆధార్‌తో అనుసంధానం కాకపోవడం లాంటి సమస్యలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా ఉపాధి, ఉద్యోగ రీత్యా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వాళ్లు, ఇతర రాష్ట్రాలు, నగరాల్లో నివాసించేవారి ఈకేవైసీ పెండింగ్లో ఉంటున్నాయి.
పీఎం కిసాన్ డబ్బులకు ఎసరు పెట్టారు - తొందరపడ్డారో ఖతమే! - PM Kisan Scam 17th Installment