Leopard Wandering At Tirumala : తిరుమలలో చిరుత సంచారం మరోసారి కలకలం రేపింది. శ్రీవారిమెట్టు ప్రాంతంలో చిరుత సంచరిస్తూ రాత్రి కంట్రోల్ రూం వద్దకు రావడంతో శునకాలు వెంటపడ్డాయి. చిరుతను చూసిన సెక్యూరిటీ సిబ్బంది భయంతో కంట్రోల్ రూమ్‌లోకి వెళ్లి తాళాలు వేసుకున్నారు. చిరుత సంచారంపై అప్రమత్తన టీటీడీ సెక్యూరిటీ గార్డు అటవీ అధికారులకు ఈ ఘటనపై సమాచారం ఇచ్చారు. కాగా గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి. కొన్నాళ్ల క్రితం తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్డులో భక్తుల కారుకు చిరుత అడ్డపడింది. ఆ దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ ఘటనపై అటవీ అధికారులు స్పందించారు.
స్పందించిన అటవీ అధికారులు :ఏపీలోనితిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో శ్రీవారి మెట్టు వద్ద చిరుత సంచారం కలకలం రేపింది. 2 రోజులుగా రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల సమయంలో చిరుత శ్రీవారి మెట్టు ప్రాంతంలో సంచరించినట్లు అటవీ అధికారులు వివరించారు. దాన్ని గమనించిన సెక్యూరిటీ సిబ్బంది ఒక్కసారిగా బయపడి కంట్రోల్ రూమ్‌లోకి వెళ్లి తాళాలు వేసుకున్నారని తెలిపారు. వెంటనే అటవీశాఖ అధికారులకు టీటీడీ సెక్యూరిటీ గార్డు సమాచారం ఇచ్చినట్లుగా వెల్లడించారు.