గిట్టుబాటు ధర ఏది జగనన్నా - నిమ్మరైతుల ఆవేదన Lemon Farmer Problems in Andhra Pradesh :కష్టపడి పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర లేక నిమ్మ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. నెల్లూరు జిల్లాలో నిమ్మ రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. సరైన ధర లేక నష్టపోతున్నామని నిమ్మ రైతులు వాపోతున్నారు. 2019లో సీఎం జగన్ నిమ్మ రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని హామీ ఇచ్చారు. మళ్లీ ఎన్నికలు వస్తున్నా నిమ్మ రైతులను కనీసం పట్టించుకున్న పాపాన పోలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
LEMON PRICE: పడిపోయిన నిమ్మధర..ఆందోళనలో రైతన్నలు
Government no Funds for Lemon Crops :ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని అనేక మండలాల్లోని రైతులు వేలాది ఎకరాల్లో నిమ్మ సాగు చేస్తున్నారు. పొదలకూరు, గూడూరులో నిమ్మ మార్కెట్లు ఉన్నప్పటికీ సరైన గిట్టుబాటు ధర లేక రైతులు నష్టపోతున్నారు. దళారుల దోపిడీ జరగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ధరలు స్థిరీకరించి రైతులకు గిట్టుబాటు అయ్యేలా ధర కల్పిస్తామని 2019లో సీఎం జగన్ ఇచ్చిన హామీ నేటికీ నెరవేరలేదని నిమ్మ రైతులు గోడు వెళ్లబోసుకుంటున్నారు.
Lemon Price: నిమ్మకాయ పిండేస్తోంది.. రెండు నెలలుగా మండుతున్న ధరలు
'ఐదేళ్లుగా సరైన ధర లేక నిమ్మ రైతులు అల్లాడుతున్నా వైఎస్సార్సీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. మిగ్‌జాం తుపాను కారణంగా నిమ్మచెట్లు పడిపోయి తీవ్రంగా నష్టపోయినప్పటికీ కనీసం పరిహారం కూడా ఇవ్వలేదు రైతుల ప్రభుత్వమని గొప్పలు చెప్పుకోవడం తప్ప ప్రభుత్వం మాకు చేసిందేమీ లేదు.' - బాధిత రైతులు
పెట్టుబడి సైతం రావట్లేదని నిమ్మ రైతుల ఆవేదన
Nellore District Lemon Farmers Problems : జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు 2019 సంవత్సరంలో పాదయాత్ర చేస్తూ పొదలకూరు నిమ్మ మార్కెట్ వద్ద మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతుకు గిట్టుబాటు ధర కల్పిస్తామని నిమ్మ రైతులకు హామీ ఇచ్చారు. అధికారం చేపట్టి ఐదు సంవత్సరాల పూర్తి కావస్తున్న నేటి వరకు అసలు నిమ్మ రైతుల గురించి ముఖ్యమంత్రి అసలు పట్టించుకోలేదని నిమ్మ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పకృతి విపత్తు వలన నష్టం జరిగిన అసలు ప్రభుత్వం పట్టించుకో లేదన్నారు. నిమ్మ రైతులకు రావాల్సిన రాయితీలు యంత్ర పరికరాలు అసలు ప్రభుత్వం ఇవ్వడం లేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హామీ ఇచ్చి నిమ్మ రైతులను నట్టేట ముంచిన వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెబుతామని రైతులు హెచ్చరిస్తున్నారు.
నిమ్మతోటలపై కరోనా తీవ్ర ప్రభావం..కష్టపడిన ఫలితం శూన్యం