Srisailam Temple Land Dispute :శ్రీశైలం మహా క్షేత్రంలో దేవస్థానం, అటవీశాఖ భూముల సరిహద్దులపై గత రెండు రోజులుగా తీవ్ర వివాదం చోటు చేసుకుంటుంది. దేవస్థానం అభివృద్ధి చేసిన స్థలాలు తమకు చెందినవని అటవీశాఖ అధికారులు చర్యలకు ఉపక్రమించారు. శ్రీశైలం అటవీశాఖ రేంజర్ నరసింహులు ఆధ్వర్యంలో శ్రీశైలంలోని టోల్గేట్, పాతాళ గంగ మార్గంలోని డార్మెంటరీలు, నంది సర్కిల్ వద్ద గుంతలు తీసి సరిహద్దుల స్తంభాలు ఏర్పాటు చేశారు. అటవీ శాఖ అధికారులు గుంతలు తవ్వి, బౌండరీలు ఏర్పాటు చేయడంపై దేవస్థానం సిబ్బంది ఆందోళన వ్యక్తం చేెెశారు.
Srisailam Temple Border Dispute With Forest Officers :శ్రీశైల దేవస్థానం -అటవీశాఖ భూముల సరిహద్దుల వివాదాన్ని పరిష్కరించేందుకు గత రెండేళ్ల క్రితం రెవెన్యూ, అటవీ శాఖ, దేవాదాయ శాఖ మంత్రులతో ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ నిర్ణయం ప్రకారం శ్రీశైల దేవస్థానం -అటవీశాఖ భూముల సరిహద్దులను రీ సర్వే చేయించారు. రీ సర్వే చేపట్టి ఇప్పటికీ ఏడాది కాలం గడిచిపోయింది. రీ సర్వే ముగిసిన వెంటనే శ్రీశైల దేవస్థానానికి అవసరమైన అటవీ భూమి 1:2 ప్రకారం ఇవ్వాలని అప్పటి ఈవో ఎస్. లవన్న అటవీశాఖ ఉన్నత అధికారులకు లేఖ రాశారు. సదరు లేఖపై అటవీశాఖ ఉన్నత అధికారుల నుంచి ఎటువంటి స్పందన లభించలేదని దేవస్థానం అధికారులు చెబుతున్నారు. 20 ఏళ్ల కిందటి నుంచి దేవస్థానం అభివృద్ధి చేసిన స్థలాలు అటవీశాఖ పరిధిలోకి వచ్చాయని, వాటిని స్వాధీనం చేసుకుంటామని ప్రస్తుత చర్యలకు దిగడం సరికాదని దేవస్థానం సిబ్బంది సూచిస్తున్నారు.
నల్గొండ దేవాదాయ భూములపై రియల్ ఎస్టేట్ పంజా - అధికారులకు సైతం పట్టని భూ ఆక్రమణలు