ETV Bharat / state

భూగర్భ సొరంగ మార్గాన్ని కబ్జా చేసిన అక్రమార్కులు - ఇళ్ల స్థలాలుగా మార్చి విక్రయిస్తున్న వైనం - OCCUPIED LANDS IN MAHABUBNAGAR

భూగర్భ సొరంగ మార్గాన్ని వదలని అక్రమార్కులు - జడ్చర్ల మండలంలో పలు గ్రామాల్లో ఆక్రమణకు గురైన భూములు - ఇళ్ల స్థలాలుగా మార్చి విక్రయిస్తున్న స్తిరాస్థి వ్యాపారులు

Occupied Lands
Occupied Lands In Mahabaubnagar (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : 12 hours ago

Occupied Lands in Mahabubnagar : కాదేదీ కబ్జాకు అనర్హం అన్నట్లు సొరంగ మార్గాల పైనున్న భూములను సైతం అక్రమార్కులు ఆక్రమించేస్తున్నారు. ప్లాట్లుగా మార్చేసి నిబంధనలకు విరుద్ధంగా అమ్మేస్తున్నారు. విషయం తెలియక భూమి కొన్న అమాయకులు మోసపోతున్నారు. సేకరించిన భూమికి హద్దులు నిర్ణయించి సూచిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో స్థిరాస్తి వ్యాపారులు దర్జాగా కబ్జా చేసి విక్రయిస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలంలో పలు గ్రామాల్లో వెలుస్తున్న అక్రమ వెంచర్లపై కథనం.

ఆక్రమణకు గురైన భూములు : మహబూబ్ నగర్ జిల్లాలోని జడ్చర్ల మండలంలో నిబంధనలకు విరుద్ధంగా స్థిరాస్తి వ్యాపారం సాగుతోంది. నీటిపారుదల శాఖ సేకరించిన భూములను ఇంటి స్థలాలుగా మార్చి అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో పలు చోట్ల సొరంగాలు ఉన్నాయి. జడ్చర్ల మండలంలో కరివెన నుంచి ఉదండాపూర్‌ జలాశయానికి నీళ్లు వెళ్లేందుకు సుమారు 9 కిలోమీటర్ల మేర సొరంగ మార్గాలున్నాయి. ఈ సొరంగ మార్గాలపై నిర్మాణాలు చేపట్టినా బోరుబావులు తవ్వినా సొరంగానికి ప్రమాదం పొంచి ఉంటుంది. అందుకే వాటి ఉపరితలంలో ఉన్న భూముల్ని సేకరించారు. ఎనిమిదేళ్ల కిందటే 15-20 మీటర్ల వెడల్పుతో టన్నెల్‌ పైభాగంలో భూమిని సేకరించి బాధితులకు పరిహారం చెల్లించారు.

హద్దులు నిర్ణయించి.. సూచిక బోర్డులు : సేకరించిన భూములకు హద్దులు నిర్ణయించి ఆ స్థలంలో భూగర్భంలో సొరంగాలున్నాయని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి. అలాంటి సంరక్షణ చర్యలు చేపట్టకపోవడంతో ఆ భూములు ఆక్రమణకు గురవుతున్నాయి. హైదరాబాద్‌- బెంగళూరు జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న భూములకు డిమాండ్‌ ఉండటంతో ఆ ప్రాంతాల్లో వెంచర్లు వెలుస్తున్నాయి. వెంచర్ల గోడలపై టన్నెల్‌కు సంబంధించిన భూములంటూ మార్కింగ్‌ చేసినా ఖాతరు చేయకుండా అమాయకులకు ఆ ప్లాట్లను అంటగట్టి సొమ్ము చేసుకుంటున్నారు.

ఇళ్ల స్థలాలుగా మార్చి విక్రయిస్తున్న అక్రమార్కలు : వరంగల్‌ జిల్లాలో దేవాదుల ఎత్తిపోతల పథకానికి సంబంధించిన టన్నెల్‌ తవ్వకాలు జరుపుతున్నప్పుడే ఉపరితలంలో చెరువుకు బుంగపడి సొరంగ మార్గంలోకి భారీగా నీరు చేరి ప్రాణనష్టం జరిగింది. జడ్చర్ల మండలంలో సొరంగ మార్గాలపై భూములను కాపాడకపోతే ఇదే పరిస్థితి తలెత్తే ప్రమాదం నెలకొంది. వెంచర్లలో భూములు కొనుగోలు చేసిన వారు అక్కడ సొరంగ మార్గం ఉందని తెలియక బోరుబావి తవ్వితే తీవ్ర ప్రభావం పడుతుంది. ఎంతో అప్రమత్తంగా ఉండాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.

ఇప్పటికైనా పట్టించుకుని హద్దులు కేటాయించి, టన్నెల్‌ భూములను స్వాధీనం చేసుకుని ప్రజలను అప్రమత్తం చేయాల్సిన అవసరముంది. సొరంగాల భూముల్లో వెంచర్లు వేసిన విషయం మా దృష్టికి రాలేదని నీటి పారుదలశాఖ మహబూబ్​నగర్ ఎస్ఈ సత్యనారాయణరెడ్డి తెలిపారు. సేకరించిన భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని, హద్దులు గుర్తించి ఆక్రమణకు గురికాకుండా చూస్తామన్నారు.

ఎట్టకేలకు సాదాబైనామాలకు మోక్షం! - ఆ భూముల కొనుగోళ్లను క్రమబద్ధీకరించనున్న ప్రభుత్వం

మీరు మూసీ నిర్వాసితులా? - ఐతే ORR​ సమీపంలో 200 గజాల స్థలం మీ సొంతం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.