Gold Rate Today December 26th 2024 : దేశంలో బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. బుధవారం 10 గ్రాముల బంగారం ధర రూ.78,30 ఉండగా, గురువారం కూడా అంతే ఉంది. బుధవారం కిలో వెండి ధర రూ.90,155 ఉండగా, గురువారం నాటికి రూ.50 పెరిగి రూ.90,205కు చేరుకుంది.
- Gold Price In Hyderabad December 26th 2024 : హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.78,320గా ఉంది. కిలో వెండి ధర రూ.90,205గా ఉంది.
- Gold Price In Vijayawada December 26th 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.78,320గా ఉంది. కిలో వెండి ధర రూ.90,205గా ఉంది.
- Gold Price In Visakhapatnam December 26th 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.78,320గా ఉంది. కిలో వెండి ధర రూ.90,205గా ఉంది.
- Gold Price In Proddatur December 26th 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.78,320గా ఉంది. కిలో వెండి ధర రూ.90,205గా ఉంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price December 26th 2024 : అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర పెరిగింది. బుధవారం ఔన్స్ గోల్డ్ ధర 2,617 డాలర్లగా ఉండగా, గురువారం నాటికి 9 డాలర్లు పెరిగి 2,626 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర 29.65 డాలర్లుగా ఉంది.
పెట్రోల్, డీజిల్ ధరలు
Petrol And Diesel Prices December 26th 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.107.45గా ఉంది. డీజిల్ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.108.27గా ఉంది. డీజిల్ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్ ధర రూ.87.66గా ఉంది.
లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
Stock market Updates December 26th 2024 : దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ సానుకూల సంకేతాల నేపథ్యంలో సూచీలు రాణిస్తున్నాయి. ఆటో, ఫైనాన్షియల్ రంగ షేర్లు కొనుగోళ్ల మద్దతుతో లాభాల్లో ట్రేడవుతున్నాయి. మార్కెట్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 200 పాయింట్ల లాభంతో నిఫ్టీ 23,800 మార్క్ పైన కదలాడుతోంది.
సెన్సెక్స్ 315 పాయింట్లు పెరిగి 78788 వద్ద ట్రేడవుతుండగా నిఫ్టీ 101 పాయింట్లు పెరిగి 23,829 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్ 30 సూచీలో ఎస్‌బీఐ, మారుతీ సుజుకీ, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, అదానీ పోర్ట్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎంఅండ్‌ఎం, ఇండస్‌ఇండ్ బ్యాంక్ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఏషియన్ పెయింట్స్, టెక్ మహీంద్రా షేర్లు మాత్రమే నష్టాల్లో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 73.90 డాలర్ల వద్ద, డాలర్‌తో రూపాయి మారకం విలువ 85.24 వద్ద కొనసాగుతోంది.