Electricity Problems in Mahabubabad :మహబూబాబాద్ జిల్లా 26వ వార్డు సమీపంలోని మందకొమురమ్మనగర్ కాలనీవాసులు మౌలిక వసతులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ స్థలంలో ఇళ్లు కట్టుకున్నారంటూ అధికారులు ఆ కాలనీలో విద్యుత్ స్తంభాలు ఏర్పాటుచేయలేదు. దీంతో పరిశ్రమ కోసం ఆ ప్రాంతంలో ఒకరు తీసుకున్న మీటరే ఆ కాలనీలోని కొందరి కరెంటు కష్టాలు తీరుస్తోంది. అక్కడ గృహాలు నిర్మించుకున్నవారిలో 136 మందికి గత ప్రభుత్వం పట్టాలిచ్చింది.
దినదిన గండం : శిథిలావస్థకు చేరిన నర్సంపేట ఎమ్మార్వో కార్యాలయం - Narsampet Registration Office
ఒక్కటే మీటరు :వారిలో 115 మందికి పురపాలక సంఘం ఇంటి నంబర్లను కేటాయించింది. అయినా అధికారులు మాత్రం కాలనీలో విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయలేదు, వీధిదీపాలు బిగించలేదు. దీంతో వారంతా కర్రలు, చెట్లకొమ్మలే ఊతంగా సర్వీసు తీగల నుంచి వైర్లు ఏర్పాటుచేసుకుని విద్యుద్దీపాలు బిగించుకుంటున్నారు. ఉన్న ఒక్కగానొక్క మీటరుకు ప్రతినెలా రూ.50 వేల నుంచి రూ.65 వేల వరకు బిల్లు వస్తుండగా, ఇంటికి కొంత చెల్లిస్తున్నారు.
అధికారుల నిర్లక్ష్యం : అయితే, ప్రభుత్వం పేదలకు విద్యుత్ రాయితీ ఇస్తుంటే, తామెందుకు బిల్లులు చెల్లించాలంటూ 4 నెలలుగా వాటిని చెల్లించడంలేదు. ఆ బిల్లు రూ.2.65 లక్షలకు పేరుకుపోయింది. విద్యుత్‌శాఖ అధికారులు స్తంభాలు ఏర్పాటు చేయకపోవడం, పురపాలక సంఘం అధికారులు పూర్తిస్థాయిలో ఇళ్ల నంబర్లను కేటాయించకపోవడంతో మీటర్లకు దరఖాస్తు చేసుకోలేదని కాలనీవాసులు చెబుతున్నారు.