Campaigning for Railway Recognition Board Elections : రైల్వే గుర్తింపు కార్మిక సంఘాల ఎన్నికలు వేడి పుట్టిస్తున్నాయి. దేశవ్యాప్తంగా డిసెంబర్ 4, 5, 6వ తేదీల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. బరిలో నిలిచిన కార్మిక సంఘాలు హోరాహోరీగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. ప్రచారంలో భాగంగా నాంపల్లి రైల్వే స్టేషన్లో సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయిస్ సంఘ్ నాయకులు సోమవారం ప్రచారం నిర్వహించారు. ఇంజిన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని సంఘ్ ప్రధాన కార్యదర్శి మర్రి రాఘవయ్య, సంఘ్ సంయుక్త ప్రధాన కార్యదర్శి భరణి భాను ప్రసాద్, డివిజనల్ కార్యదర్శి ప్రభు రాజు, జోనల్ మహిళా నాయకురాలు సత్యవాణి ఓటర్లను అభ్యర్థించారు.
దేశవ్యాప్తంగా డిసెంబర్ 4, 5, 6 తేదీల్లో రైల్వే గుర్తింపు ఎన్నికలు జరుగుతున్నాయి. హైదరాబాద్‌లో ఎన్నికల ప్రచారానికి వచ్చాం. ప్రతి కార్మికుడు మర్రి రాఘవయ్య ఇంజిన్ గుర్తుకు ఓటు వేసి సౌత్ సెంట్రల్ రైల్వే సంఘాన్ని గెలిపించుకోవాలి. రైల్వే కార్మికులకు ఏవైనా పనులు జరిగాయంటే అది కేవలం సౌత్ సెంట్రల్ రైల్వే వల్లే. ఈసారి జరిగే ఎన్నికల్లో సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయిస్ సంఘ్‌కు ఓట్లు వేసి గెలిపించాలి. - భరణి భాను ప్రసాద్, సౌత్ సెంట్రల్ లైల్వే సంఘ్ సంయుక్త ప్రధాన కార్యదర్శి