KTR Tweet on The Economist Magazine Article : రాష్ట్ర ప్రగతి, సక్సెస్ఫుల్ మోడల్‌పై 'ది ఎకనమిస్ట్ మ్యాగజైన్ కథనం'పై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పందించారు. ఇప్పటికైనా పదేళ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానంపైన బురద జల్లడం మానుకోవాలని సూచించారు. అభివృద్ధి యజ్ఞాన్ని ముందుకు తీసుకుపోవాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి కేటీఆర్ సూచనలు చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
ప్రపంచ ప్రఖ్యాత మ్యాగజైన్లు సైతం తెలంగాణ పదేళ్ల ప్రగతి ప్రస్థానాన్ని గొప్పగా కొనియాడుతున్న నేపథ్యంలో, ఇకనైనా కాంగ్రెస్ పాలకులు బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిపై తప్పుడు ప్రచారాలు నిలిపివేస్తారని ఆశిస్తున్నానంటూ కేటీఆర్ తెలిపారు. బీఆర్ఎస్ సాధించిన అభివృద్ధిని ఎలాంటి అడ్డంకులు లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందని ఆశిస్తున్నానంటూ పేర్కొన్నారు.
"ఇప్పటికైనా పదేళ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానం పైన బురద జల్లడం మానుకోవాలి. అభివృద్ధి యజ్ఞాన్ని ముందుకు తీసుకుపోవాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచన. ప్రపంచ ప్రఖ్యాత మ్యాగజైన్లు సైతం తెలంగాణ పదేళ్ల ప్రగతి ప్రస్తానాన్ని గొప్పగా కొనియాడుతున్న నేపథ్యంలో, ఇకనైనా కాంగ్రెస్ పాలకులు బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిపై తప్పుడు ప్రచారాలు నిలిపివేస్తారని ఆశిస్తున్నాను. బీఆర్ఎస్ సాధించిన అభివృద్ధిని ఎలాంటి ఆటంకం లేకుండా ముందుకు తీసుకెళ్లాలని ఆశిస్తున్నాను."- కేటీఆర్ ట్వీట్