ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'జైల్లో పెడితే యోగా చేసి పాదయాత్రకు సిద్ధమవుతా' - మాజీ మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు

లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చినందుకు తనపై కేసు పెడతారా అని ప్రశ్నించిన బీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్

KTR_Comments
KTR Comments (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 7, 2024, 7:57 PM IST

KTR Comments :తెలంగాణకి లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చినందుకు తనపై కేసు పెడతారా అని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీమంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. తనపైన ఎన్ని కేసులైనా పెట్టుకోండని, కాంగ్రెస్‌ హామీలపై ప్రశ్నిస్తూనే ఉంటానని తేల్చిచెప్పారు. జైలుకెళ్లేందుకైనా నేను సిద్ధమే అని, జైల్లో పెడితే యోగా చేసి పాదయాత్రకు సిద్ధపడతానని చెప్పారు. రాజ్‌భవన్‌లో కాంగ్రెస్‌, బీజేపీ ఒక్కటవుతున్నాయని విమర్శించారు. కాంగ్రెస్‌, బీజేపీ ఒక్కటై బీఆర్‌ఎస్‌ను ఖతం చేసేందుకు యత్నిస్తున్నాయని ఆరోపించారు.

హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ను పెంచేందుకే F1 రేసింగ్‌ నిర్వహించామని మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రభుత్వం 55 కోట్లు ఖర్చుచేస్తే ఏడాదిలోనే 700 కోట్ల లాభం సర్కార్‌కు చేకూరిందని చెప్పారు. F1 రేసింగ్‌ రద్దు చేస్తూ రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకోవడం వల్ల రాష్ట్రానికి, హైదరాబాద్‌కు తీరని నష్టం కలిగించారని కేటీఆర్ విమర్శించారు. F1 రేసింగ్‌ విషయంలో ఎలాంటి విచారణకైనా సిద్ధమని సవాల్‌ విసిరిన కేటీఆర్, అసలు అవినీతి జరగలేదని తేల్చిచెప్పారు.

రేవంత్ రెడ్డిపై కేసు పెట్టాలి: తనపై కేసు ఎందుకు పెడతారని ప్రశ్నించిన ఆయన, లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చినందుకా అని అడిగారు. ఎన్ని కేసులైనా పెట్టుకోవచ్చని, రెండు, మూడు నెలలు జైల్లో పెడితే సిద్దమని కేటీఆర్ వ్యాఖ్యానించారు. జైళ్లో యోగా చేసి పాదయాత్రకు సిద్ధపడతానని వ్యాఖ్యానించారు. తనపై కోపంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఫార్ములా ఈ రేసు రద్దు చేశారని అన్నారు. చివరి నిమిషంలో ఫార్ములా ఈ రేసు రద్దు చేసి అంతర్జాతీయంగా చెడ్డపేరు తీసుకొచ్చారని, హైదరాబాద్​కు నష్టం చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పురపాలకశాఖపై కేసు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

'ఎక్స్​' వేదికగా అభిమానుల సందేహాలు - అలాగైతే రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తానన్న కేటీఆర్

700 కోట్లకు పైగా లాభం వచ్చింది: హైదరాబాద్​ను విశ్వనగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో సియోల్, జోహ్నెస్ బర్గ్​తో పోటీపడి మరీ ఫార్ములా ఈ రేసును తీసుకొచ్చామని, ఎలక్ట్రిక్ వాహనాలకు హబ్​గా చేయాలని భావించినట్లు చెప్పారు. మొదటిసారి ఫార్ములా ఈ రేసుకి ప్రభుత్వం ఖర్చు పెట్టింది 35 నుంచి 40 కోట్లు మాత్రమేనని, గ్రీన్ కో వంద కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. రేసుతో 700 కోట్లకు పైగా లాభం వచ్చిందని నెల్సన్ సంస్థ నివేదిక ఇచ్చినట్లు గుర్తు చేశారు.

డబ్బులు ఇస్తామని హామీ ఇచ్చా:అమర్ రాజా బ్యాటరీస్ కోట్లు, హ్యుండాయ్ కంపెనీలు భారీ పెట్టుబడులకు ముందుకొచ్చాయి, మరో 2500 కోట్ల పెట్టుబడులు వచ్చాయని కేటీఆర్ వివరించారు. గిట్టుబాటు కావడం లేదని గ్రీన్ కో ఒప్పందం నుంచి తప్పుకొందని, దాంతో హైదరాబాద్​ను తొలగిస్తున్నట్లు నిర్వాహకులు చెప్పారని పేర్కొన్నారు. నిర్వాహకులతో వీడియో కాన్ఫరెన్స్​లో పాల్గొని మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత స్పాన్సర్​ను పట్టుకుంటాం అని చెప్పానని, ప్రభుత్వం నుంచి డబ్బులు ఇస్తామని హామీ ఇచ్చినట్లు కేటీఆర్ వివరించారు.

ఈవెంట్​కు డబ్బులు ఇవ్వాలని నిర్ణయించి, సంబంధిత దస్త్రంపై అప్పటి పురపాలక శాఖ మంత్రిగా సంతకం పెట్టినట్లు చెప్పారు. హెచ్ఎండీఏ స్వతంత్ర ప్రతిపత్తి సంస్థ అని, కేబినెట్, ప్రభుత్వ అనుమతి అవసరం లేదని అన్నారు. హెచ్ఎండీఏ ఛైర్మన్​గా ఉన్న ముఖ్యమంత్రికి సమాచారం ఇచ్చి డబ్బులు ఇవ్వాలని కమిషనర్​కు ఆదేశాలు ఇచ్చానని, అందుకు అనుగుణంగా అర్వింద్ కుమార్ 55 కోట్లు చెల్లించారని తెలిపారు. ప్రభుత్వంలో డబ్బు అవసరమైనప్పుడు వివిధ రూపాల్లో సర్దుబాటు చేస్తామని తెలిపారు.

హైదరాబాద్ ప్రతిష్టను దెబ్బతీయవద్దు: రేసు రద్దు చేయాలన్న రేవంత్ రెడ్డి నిర్ణయంతో ఆ సంస్థకు లాభం జరిగి, రాష్ట్రానికి నష్టం జరిగిందని అన్నారు. రేసు రద్దు చేసినందుకు రేవంత్‌రెడ్డి, సంబంధిత శాఖలపై కేసు పెట్టాలన్నారు. తాము బ్రాండ్‌ ఇమేజ్‌ క్రియేట్ చేస్తే, రేవంత్‌రెడ్డి బ్యాడ్‌ ఇమేజ్‌ తెస్తున్నారని మండిపడ్డారు. తనపై వచ్చిన ఆరోపణలపై విచారణ చేపడితే ఎదుర్కొంటానని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా పరిపాలనపై దృష్టి పెట్టాలని, హైదరాబాద్ ప్రతిష్టను దెబ్బతీయవద్దని కేటీఆర్ సూచించారు.

కొండా సురేఖ పబ్లిసిటీ కోసమే ఆ వ్యాఖ్యలు చేశారు - పరువునష్టం దావాపై కేటీఆర్ వాంగ్మూలం

ABOUT THE AUTHOR

...view details