Dhanush Aishwarya Divorce : ప్రముఖ తమిళ నటుడు ధనుశ్, ఐశ్వర్య రజనీకాంత్లకు ఫ్యామిలీ కోర్ట్ బుధవారం విడాకులు మంజూరు చేసింది. దీనితో వీరి 18 ఏళ్ల వివాహబంధానికి తెరపడింది.
ప్రముఖ తమిళ సినీ డైరెక్టర్ కస్తూరిరాజా కుమారుడే ధనుశ్. ఆయన సూపర్‌స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్యను 2004 నవంబర్ 18న పెళ్లి చేసుకున్నారు. ఇరు కుటుంబాల పెద్దల ఆశీస్సులతోనే ఈ వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. దాదాపు 18 ఏళ్లపాటు కాపురం చేసిన ఈ జంట 2022 నవంబర్‌లో తాము విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తరువాత చట్టబద్ధంగా విడిపోవడానికి ఫ్యామిలీ కోర్ట్‌ను ఆశ్రయించారు. పరస్పర అంగీకారంతో విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేశారు. ఈ ఏడాది నవంబర్ 21న ఫ్యామిలీ కోర్ట్ ముందు వీరిరువురూ విచారణకు హాజరయ్యారు. పరస్పరం విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు న్యాయస్థానానికి తెలిపారు. దీనితో న్యాయమూర్తి బుధవారం వారికి విడాకులు మంజూరు చేశారు.