ETV Bharat / state

గవర్నర్​ను కలిసిన వైఎస్​ షర్మిల - ఎందుకంటే - YS SHARMILA COMPLAINT TO GOVERNOR

అదానీ, జగన్ ఒప్పందంపై దర్యాప్తు జరిపించాలని గవర్నర్​ను కోరిన వైఎస్ షర్మిల - జగన్ అవినీతిపరుడు కాకుంటే తన పిల్లలపై ప్రమాణం చేయాలని డిమాండ్

APCC Chief YS Sharmila Complaint to Governor
APCC Chief YS Sharmila Complaint to Governor (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 27, 2024, 8:18 PM IST

APCC Chief YS Sharmila Complaint to Governor : మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఖాళీ చెక్కులా అదానికీ రాసి ఇచ్చారని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల విమర్శించారు. ఆంధ్రప్రదేశ్​ను 'అదానీప్రదేశ్‌'గా మార్చేశారని మండిపడ్డారు. రూ.1,750 కోట్ల ముడుపులు చేతులు మారినట్లు ఆధారాలతో సహా వ్యవహారం బయటకొస్తే జగన్‌ ఇప్పటివరకు ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు. విజయవాడలోని రాజ్‌భవన్‌కు షర్మిల నేతృత్వంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకుల బృందం వెళ్లి గవర్నర్‌ అబ్దుల్‌నజీర్‌కు జగన్ హయాంలో జరిగిన విద్యుత్తు ఒప్పందాన్ని రద్దు చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.

రాబోయే తరాన్ని కూడా తాకట్టు : ఈ ఒప్పందం వల్ల రాష్ట్రానికి తీవ్రంగా నష్టం జరుగుతుందని, ప్రజలపై భారం పడుతుందని ఫిర్యాదు చేశారు. ఈ ఒప్పందం కోసం రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టారని పేర్కొన్నారు. వచ్చే 25 ఏళ్లపాటు ఒప్పందం అంటే, రాబోయే తరాన్ని కూడా తాకట్టు పెట్టినట్లేనని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదే సెకితో అప్పట్లో గుజరాత్ ప్రభుత్వం కేవలం రూ.1.99 ఒప్పందం చేసుకుందని వెల్లడించారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రం రూ.2.49 చేసుకుందన్నారు. మొత్తంగా యూనిట్​కి 5 రూపాయలు పడుతుందని, ఈ ఒప్పందం కారణంగా ప్రజలపై లక్షల కోట్ల భారం పడుతుందని ఫిర్యాదులో వెల్లడించారు.

కేంద్రం ఇచ్చే రాయితీ కొంతే - సెకి విద్యుత్‌కు ఐఎస్‌టీఎస్‌ ఛార్జీలు చెల్లించాల్సిందే!

ఇప్పటికే ప్రజలపై 17 వేల కోట్ల సర్దుబాటు చార్జీల భారం ఉందని షర్మిల అన్నారు. విద్యుత్తు ఒప్పందమే కాకుండా రాష్ట్రంలోని మొత్తం పోర్టు లను జగన్‌ అమ్మేశారని విమర్శించారు. లంచాల కోసమే జగన్ ఆ ఒప్పందాలకు సంతకాలు పెట్టారన్నారు. జగన్ అవినీతి పరుడు కాకపోతే తన బిడ్డల మీద ప్రమాణం చేయాలని షర్మిల డిమాండ్‌ చేశారు.

ACB on Jagan Bribery case : వైఎస్సార్సీపీ హయాంలో ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్‌కు అదానీ సంస్థ భారీ లంచం ఇచ్చిన వ్యవహారంపై ఏసీబీకి ఫిర్యాదు అందింది. సెంటర్‌ ఫర్‌ లిబర్టీ సంస్థ వ్యవస్థాపకుడు నల్లమోతు చక్రవర్తి జగన్- అదానీ లంచం వ్యవహారంపై ఏసీబీకి ఫిర్యాదు చేశారు. వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డికి అదానీ సంస్థ రూ.1,750 కోట్లు లంచం ఇచ్చారని అమెరికా ఏజెన్సీ విచారణలో తేలిందని చక్రవర్తి ఫిర్యాదులో పేర్కొన్నారు. కావున సెకితో అదానీ కంపెనీ ఒప్పదంపై విచారణ జరపాలని కోరారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

'సెకి' వ్యవహారంపై స్టేటస్‌కో ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరణ

SECI: సెకి ఒప్పందం.. ప్రజలకు భారం..! దీర్ఘకాల విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలపై మారిన మాట

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.