ETV Bharat / state

జీబీఎస్‌ వ్యాధికి చికిత్స అన్ని ప్రధాన ఆస్పత్రుల్లో ఉంది: సత్యకుమార్‌ - MINISTER SATYAKUMAR ON GBS

జీబీఎస్ కేసుల పట్ల అప్రమత్తంగా ఉన్నామన్న మంత్రి సత్యకుమార్‌ - గుంటూరు, విశాఖ సహా 6 ఆస్పత్రుల్లో ఎక్కువ కేసులు ఉన్నాయని వెల్లడి

Minister_Satyakumar_on_GBS
Minister_Satyakumar_on_GBS (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 17, 2025, 7:06 PM IST

Minister Satyakumar on GBS Cases: గులియన్-బారే సిండ్రోమ్(GBS) కేసుల పట్ల వైద్యారోగ్య శాఖ అప్రమత్తంగా ఉందని ఆ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. వైద్యారోగ్య శాఖ తీసుకుంటున్న చర్యలపై సీఎం సమీక్ష చేశారని తెలిపారు. గత ఏడాది రాష్ట్రంలో 301 కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. గుంటూరు జీజిహెచ్​లో అత్యధికందా కేసులు నమోదు అయ్యాయని వివరించారు. గుంటూరు, విశాఖ సహా ఆరు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎక్కువ సంఖ్యలో నమోదు కావడానికి ఇతర ప్రాంతాల నుంచి కేసులు రావడమే కారణమని అన్నారు. అక్కడకు రిఫరెన్స్​లు ఎక్కవ ఉండడంతో కేసులు నమోదు అవుతున్నాయని పేర్కొన్నారు.

జీబీఎస్ బారిన పడిన వారికి సరపడా ఇమ్యూనో గోబిలిన్ ఇంజక్షన్​లు ఉన్నాయని మంత్రి స్పష్టం చేసారు. జీబీఎస్ భారిన పడ్డవారిలో 85 శాతం మంది చికిత్స లేకుండానే తగ్గిపోతుందని అన్నారు. ఈ వ్యాధికి సంభందించి చికిత్స అన్ని ప్రధాన ఆసుపత్రులలో ఉందని తెలిపారు. దీనికి సంభందించి రోజుకు 5 ఇంజక్షన్​లు లక్ష రూపాయలు ఖర్చు అవుతుందని వెల్లడించారు. 5 రోజులు పాటు ఈ ఇంజక్షన్​లు ఇవ్వాల్సి ఉంటుందని మంత్రి సత్యకుమార్ తెలిపారు.

శ్రీవారి ఆలయంపై విమాన రాకపోకలు - విచారించి చర్యలకు ఆదేశిస్తాం : హోం మంత్రి అనిత

జీబీఎస్​పై సీఎం చంద్రబాబు సమీక్ష - జాగ్రత్తలు పాటించాలని ఆదేశం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.