Korean Beauty Standards :కొరియన్లు ఎల్లప్పుడూ ప్రకాశవంతమైన చర్మం, యవ్వన ఛాయను కలిగి ఉంటారు. జన్యుపరమైన మార్పు కాకపోయినా, కొరియన్లు సుదీర్ఘమైన, శక్తివంతమైన జీవితానికి ఆరోగ్యకరమైన అలవాట్లే కారణం అని ఎంత మందికి తెలుసు? కొరియన్ల సంస్కృతి వారికి సంపూర్ణ ఆరోగ్యాన్ని అందిస్తుంది. జీవనశైలికి తోడు ముఖ్యంగా కొన్ని రకాల ఆహారపు అలవాట్లు కొరియన్ల అందంలో కీలక పాత్ర పోషిస్తాయి. అవేంటో తెలుసుకుందామా?
మార్నింగ్ స్కిన్‌కేర్ రిచ్యువల్ :కొరియన్లు క్లీన్స్, టోన్లు, మాయిశ్చరైజ్ చేసే మల్టీ స్టెప్ స్కిన్‌కేర్ ఉపయోగిస్తుంటారు. అది చర్మాన్ని తేమగా, ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.
సూర్యరశ్మి నుంచి సంరక్షణ :కొరియన్లు సూర్యరశ్మి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. చర్మం ముడతలు పడకుండా, ఎండ దెబ్బతినకుండా ప్రతిరోజూ సన్‌స్క్రీన్‌ని ఉపయోగిస్తారు. ఆకాశం మేఘావృతమైన రోజుల్లోనూ సన్‌స్క్రీన్ వాడుతుంటారు. పులియబెట్టిన ఆహారాలు అధికంగా తీసుకుంటారు. కొరియన్ వంటకాల్లో ముఖ్యంగా కిమ్చి, గోచుజాంగ్ వంటి పులియబెట్టిన ఆహారాలు ప్రోబయోటిక్స్‌తో నిండి ఉంటాయి. ఇవి జీర్ణాశయ ఆరోగ్యాన్ని పెంచడంతో పాటు యవ్వన మెరుపునకు దోహదం చేస్తాయి.
టాక్సిన్స్ ఫ్లష్ చేయడానికి, చర్మాన్ని బొద్దుగా ఉంచడానికి నీరు చాలా అవసరం. కొరియన్లు రోజంతా హైడ్రేటెడ్‌గా ఉండటానికి ప్రాధాన్యమిస్తారు. నిద్ర విషయంలో వారు ఏ మాత్రం రాజీపడరు. చక్కని ఆరోగ్యం కోసం రాత్రి వేళల్లో కంటి నిండా నిద్రపోతారు. ఇవే గాకుండా నిరంతర వ్యాయామం కొరియన్ ఆరోగ్యానికి మూలస్తంభం అని చెప్పుకోవచ్చు. చురుకైన నడక మొదలుకుని పాప్ డ్యాన్స్ వ్యాయామాల వరకు కొరియన్ల అందానికి సహకరించే అంశాలే.