తెలంగాణ

telangana

ETV Bharat / state

వైభవంగా ప్రారంభమైన కొమురవెల్లి మల్లన్న జాతర - మొక్కులు చెల్లించుకున్న భక్తులు - Komuravelli Mallanna Jathara 2024

Komuravelli Mallanna Jathara Start : భక్తుల కొంగు బంగారం కోరమీసాల కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల జాతర ఇవాళ అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. భక్తులు పట్నాలు, బోనాలు తీసి మల్లికార్జున స్వామి, రేణుక ఎల్లమ్మల మొక్కులను చెల్లించుకున్నారు. స్వామి వారి దర్శనానికి భక్తులకు సుమారు నాలుగు గంటల సమయం పట్టింది.

Komuravelli Mallanna Temple Siddipet
Komuravelli Mallanna Jathara Start

By ETV Bharat Telangana Team

Published : Jan 21, 2024, 7:04 PM IST

Komuravelli Mallanna Jathara Start : ప్రముఖ శైవక్షేత్రాల్లో ఒకటైన సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలోని మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు(జాతర) ఇవాళ అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఎక్కడ చూసినా పట్నాలు, బోనాల ఊరేగింపు, శివభక్తుల పూనకాలు, భక్తుల జయ జయ ధ్వనులతో కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయ ప్రాంగణం మార్మోగింది.

భక్తుల కొంగు బంగారమై విరాజిల్లుతున్న కొమురవెల్లి మల్లన్న జాతర, ఏటా సంక్రాంతి(Pongal) తర్వాత వచ్చే మొదటి ఆదివారంతో మొదలై, మూడు నెలల పాటు భక్తి శ్రద్ధలతో కొనసాగుతుంది. ఉగాదికి ముందు వచ్చే ఆదివారం అర్ధరాత్రి నిర్వహించే అగ్నిగుండాల కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలుముగుస్తాయి. జాతర మొదలయ్యే తొలి ఆదివారాన్ని పట్నం వారంగా పిలుస్తారు.

Komuravelli Mallanna Temple :మల్లన్న దర్శనానికి తరలివచ్చే భక్తుల్లో చాలా వరకు హైదరాబాద్​కు చెందిన వారే ఉంటారు. స్వామిని దర్శించుకుని ఇక్కడే బస చేసి, పట్టణ భక్తులు సోమవారం తోట బావి సమీపంలోని కల్యాణ వేదిక(Wedding Venue) వద్ద సొంత ఖర్చులతో పట్నం వేస్తారు. అదేవిధంగా అగ్నిగుండాల కార్యక్రమం చేపడతారు. జాతరలో అత్యధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చే వారం కూడా ఇదే.

ఐనవోలు జాతరకు వేళాయె - మల్లన్న బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం

జాతరలో భాగంగా ప్రతి ఆదివారం ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. ముఖ్యంగా ఆదివారం ఆలయానికి విచ్చేసిన భక్తులు మట్టిపాత్రల్లో నైవేద్యం వండి, అలంకరించి, నెత్తిన పెట్టుకొని పూనకాలతో స్వామికి, కొండపై ఉన్న మల్లన్న తోబుట్టువు రేణుకా ఎల్లమ్మకు(Renuka Yellamma) బోనం సమర్పించుకుంటారు. వారాంతంలో శనివారం కొమురవెల్లికి వచ్చే భక్తులు, అదేరోజు ధూళి దర్శనం చేసుకుని, ఇక్కడే బస చేసి మరుసటి రోజు ఉదయం బోనాలు సమర్పిస్తూ మల్లన్న పట్నాలు వేయడం ఇక్కడి ఆనవాయితీ.

20 ఏళ్లుగా క్రమం తప్పకుండా మల్లన్న బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామిని దర్శించుకుంటున్నాము. శనివారం స్వామివారికి బియ్యం పోసి, ఇవాళ బోనాలు సమర్పించుకున్నాం. భక్తుల దర్శనార్థం ఏర్పాటు చేసిన వసతులు చాలా బాగున్నాయి. కానీ క్యూలైన్లు దగ్గర కాస్త గందరగోళం ఏర్పడుతుంది. బియ్యం, బోనాలు సమర్పించే వారికి విడివిడిగా లైన్లు ఏర్పాటు చేస్తే బాగుంటుంది. దానివల్లే భక్తులు బారులు తీరి, దర్శనానికి సుమారు నాలుగు గంటల సమయం పడుతుంది. - భక్తులు

వైభవంగా కొమురవెల్లి మల్లన్న జాతర ప్రారంభం - దర్శనానికి నాలుగు గంటలకు పైగా సమయం

Komuravelli Mallanna Jatara 2024 :మల్లికార్జున స్వామి జాతర బ్రహ్మోత్సవాల ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని ఆలయ సిబ్బంది, పోలీస్ అధికారులు(Police Officials) భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. అయినప్పటికీ కొండపైకి బోనంతో వెళ్లే భక్తులు క్యూ లైన్లలో ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలో స్వామివారి దర్శనానికి భక్తులకు సుమారు నాలుగు గంటలకు పైగా సమయం పట్టింది.

Odela Mallanna Brahmotsavam : ఓదెల మల్లన్న బ్రహ్మోత్సవాల్లో ఘనంగా.. 'అగ్నిగుండ కార్యక్రమం'

ఐనవోలు మల్లన్న జాతర డ్రోన్ విజువల్స్​ మీరెప్పుడైనా చూశారా

ABOUT THE AUTHOR

...view details