Kishan Reddy Laid Down Ramji Gond Museum in Hyderabad : నిజాం, రజాకార్లకు వ్యతిరేకంగా రామ్ జీ గోండు పోరాటం చేశారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కొనియాడారు. గిరిజన సంస్కృతి(Tribal Culture) సంప్రదాయాలు భవిష్యత్ తరాలకు తెలియజేయాల్సి ఉందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. అందుకే హైదరాబాద్‌లో రామ్ జీ గోండు పేరుతో ట్రైబల్ మ్యూజియం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా పది ట్రైబల్ మ్యూజియంలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
గత ప్రభుత్వం వల్లే ట్రైబల్ మ్యూజియం ఆలస్యం : ఆంధ్రప్రదేశ్‌లోనూ మ్యూజియానికి సంబంధించిన పనులు జరుగుతున్నాయని వివరించారు. ఇవాళ హైదరాబాద్ అబిడ్స్‌లో రామ్ జీ గోండు ట్రైబల్ మ్యూజియానికి రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి(Panchayat Raj Minister)సీతక్కతోకలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఆనాటి కేసీఅర్ ప్రభుత్వం వల్ల తెలంగాణలో మ్యూజియం ఏర్పాటు ఆలస్యమైందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు.
కేసీఆర్‌కు ఎన్ని లేఖలు రాసినా స్పందన రాలేదని చెప్పారు. ఇవాళ ట్రైబల్ మ్యూజియానికి శంకుస్థాపన చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ములుగులో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం(Central Tribal University) ఏర్పాటు చేస్తున్నామని గుర్తు చేశారు. గత ప్రభుత్వం గిరిజన విశ్వవిద్యాలయానికి భూమి ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేసిందని ఆరోపించారు. గిరిజన విశ్వవిద్యాలయం వల్ల విద్య, ఉపాధి అవకాశాలు మెరుగు పడుతాయని, మొదటి ఫేజ్‌లో రూ.900 కోట్లు గిరిజన యూనివర్సిటీకి కేటాయించామని తెలిపారు.