తెలంగాణ

telangana

ETV Bharat / state

"సింగరేణి, విద్యుత్ కార్మికులు తెలంగాణకు రెండు కళ్లు లాంటి వారు" - TRVKS DIARY CALENDAR INAUGURATE

టీఆర్​వీకేఎస్ డైరీ, క్యాలెండర్‌ను ఆవిష్కరించిన ఎంపీ రఘురాంరెడ్డి, ఎమ్మెల్యే కూనంనేని - క్రమబద్ధీకరించిన జూనియర్ అసిస్టెంట్లకు స్క్రీనింగ్ టెస్ట్ లేకుండా పదోన్నతి కల్పించాలని కార్మికుల డిమాండ్

Khammam MP Raghuram Reddy Inaugurate TRVKS Diary Calendar
Khammam MP Raghuram Reddy Inaugurate TRVKS Diary Calendar (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jan 29, 2025, 7:09 PM IST

Khammam MP Raghuram Reddy Inaugurate TRVKS Diary Calendar :ఆర్టిజన్ కార్మికులను క్రమబద్ధీకరించడంతో పాటు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలన్న విద్యుత్​ కార్మికుల డిమాండ్​ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుని వెళ్తామని ఖమ్మం ఎంపీ రఘురామిరెడ్డి, కొత్తగూడెం శాసనసభ్యుడు కూనంనేని సాంబశివరావు హామీ ఇచ్చారు. క్రమబద్ధీకరించిన జూనియర్ అసిస్టెంట్లకు స్క్రీనింగ్ టెస్ట్ లేకుండా పదోన్నతి కల్పించాలని కార్మికులు డిమాండ్ చేశారు.

తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం డైరీ ఆవిష్కరణ కార్యక్రమం సికింద్రాబాద్​లోని హరిహర కళా భవన్​లో జరిగింది. ఈ కార్యక్రమానికి రామసహాయం రఘురాం రెడ్డి, కూనంనేని సాంబశివరావు హాజరై డైరీతో పాటు క్యాలెండర్​ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కార్మికుల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లవేళలా పని చేస్తూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని వెల్లడించారు.

సింగరేణి కార్మికులు, తెలంగాణ విద్యుత్ కార్మికులు తెలంగాణ రాష్ట్రానికి రెండు కళ్ళలాంటి వారని, వారి సమస్యలు పరిష్కరించకపోతే చీకటి అలుము కుంటుందని సాంబశివరావు అన్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ విద్యుత్ కార్మిక సంఘం సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్ టీజీపీడీసీఎల్ సెక్రటరీ కరెంట్ రావు, తెలంగాణ విద్యుత్ కార్మికుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్​తో పాటు విద్యుత్ కార్మికులు పాల్గొన్నారు.


"విద్యుత్​ కార్మికులకు సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలపై ఎమ్మెల్యే సాంబశివరావు గారు నేను చర్చించాం. సమస్యల పరిష్కారానికి ఉపముఖ్యమంత్రిని కలిసి వివరిస్తాం. వీరికి న్యాయం జరిగేలా చేస్తాం."- రామసహాయం రఘురాం రెడ్డి, ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు

"తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం డైరీ, క్యాలెండర్​ను ఆవిష్కరించాం. ఆర్టిజన్ కార్మికులను క్రమబద్ధీకరించడంతో పాటు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలన్న విద్యుత్​ కార్మికుల డిమాండ్​ను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్తాం. వారి సమస్యలు పరిష్కరిస్తాం." - కూనంనేని సాంబశివరావు, కొత్తగూడెం శాసనసభ్యుడు

ABOUT THE AUTHOR

...view details