Key Progress in Construction of Regional Ring Road :రీజనల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) నిర్మాణంలో మరో అడుగు ముందుకు పడింది. ఆర్‌ఆర్‌ఆర్ ఉత్తరభాగం పనులకు కేంద్రంటెండర్లు పిలిచింది. 4 లైన్ల ఎక్స్‌ప్రెస్ రహదారి నిర్మాణానికి టెండర్లు పిలిచినట్లు ప్రకటించింది. ముందుగా గిర్మ్‌పూర్ నుంచి యాదాద్రి వరకు రోడ్డు నిర్మాణానికి టెండర్లు సమర్పించాల్సిందిగా ఆహ్వానించింది. రెండేళ్లలో రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని నిబంధనల్లో కేంద్రం పేర్కొంది. మొత్తం 4 భాగాలుగా విభజించి రూ.5,555 కోట్ల నిధులతో ఆర్ఆర్‌ఆర్ నిర్మాణం చేపడుతోంది. ఇందుకోసం పనులను నాలుగు ప్యాకేజీలుగా విభజించింది.
- ప్యాకేజీ-1 సంగారెడ్డి జిల్లా గిర్మ్‌పూర్ - రెడ్డిపల్లి (34.51 కి.మీ.)
- ప్యాకేజీ- 2 రెడ్డిపల్లి నుంచి ఇస్లాంపూర్ వరకు 26 కి.మీ. నిర్మాణం
- ప్యాకేజీ- 3 ఇస్లాంపూర్ నుంచి ప్రజ్ఞాపూర్ వరకు 23 కి.మీ. నిర్మాణం
- ప్యాకేజీ-4 ప్రజ్ఞాపూర్ నుంచి యాదాద్రి జిల్లా రాయగిరి(43 కి.మీ.)
- మొత్తం 161.5 కి.మీ. ఉత్తరభాగం నిర్మాణానికి టెండర్లు పిలిచిన కేంద్రం