Horoscope Today January 1st, 2025 : 2025 జనవరి 1వ తేదీ (బుధవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?
మేషం (Aries) : మేషరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి అన్నింటా విజయం సాధిస్తారు. భవిష్యత్ పట్ల స్పష్టమైన అవగాహనతో ముందుకెళ్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. అన్ని పనులు అనుకున్నవి అనుకున్నట్లుగా జరగడం వల్ల మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. అనవసర వాదనలు, చర్చలకు దూరంగా ఉంటే మంచిది. ఇష్ట దేవతారాధన శుభకరం.
వృషభం (Taurus) : వృషభరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఈ రోజు మొదలుపెట్టిన పనులు అసంపూర్ణంగా మిగులుతాయి. ఖర్చులను అదుపులో ఉంచుకోండి. ఉద్యోగస్తులు కష్టపడి పనిచేయడం వల్ల విజయం సాధించవచ్చు. వ్యాపారులు ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండాలి. కోపాన్ని, మాటలను నియంత్రణలో పెట్టుకోండి. పనిలో ఆటంకాలు ఉండే అవకాశం ఉంది కాబట్టి కొత్త పనులకు దూరంగా ఉండండి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఆదిత్య హృదయం పారాయణ శక్తినిస్తుంది.
మిథునం (Gemini) : మిథునరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కుటుంబంలో ఎన్నడూ లేనంత సంతోషం నెలకొంటుంది. శుభకార్యాలు జరుగుతాయి. సంపదలు వృద్ధి చెందుతాయి. వృత్తి పరంగా నిరాశాజనకంగా ఉండవచ్చు. పనుల్లో ఆటంకాలు, సవాళ్లు చికాకు కలిగిస్తాయి. మిత్రుల సహాయంతో ఆర్థికంగా మేలు జరుగుతుంది. శివ పంచాక్షరీ జపం శక్తినిస్తుంది.
కర్కాటకం (Cancer) : కర్కాటకరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వృత్తి పరంగా గొప్ప శుభవార్తలు వింటారు. కార్యసిద్ధి, శత్రుజయం ఉంటుంది. అనుకోని సంపదలు చేకూరుతాయి. మాతృవర్గం నుంచి అందిన శుభవార్త మీ ఇంటి వాతావరణాన్ని సంతోషభరితం చేస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఇష్ట దేవతారాధన శుభప్రదం.
సింహం (Leo) : సింహరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ రోజు ఆర్థికంగా గొప్ప శుభ ఫలితాలు ఉంటాయి. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టినవారు ఈ రోజు ఊహకందని లాభాలను అందుకుంటారు. వ్యాపారులు గతంలో పెట్టిన పెట్టుబడులకు మంచి లాభాలు వస్తాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉండవచ్చు. సూర్య ఆరాధన శ్రేయస్కరం.
కన్య (Virgo) : కన్యారాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో పనిభారం పెరగడం వల్ల ఒత్తిడికి లోనవుతారు. అన్ని రంగాల వారికి శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. అనారోగ్య సమస్యలు చికాకు పెడతాయి. కుటుంబంతో మంచి సమయాన్ని గడిపితే ఒత్తిడి తగ్గి ప్రశాంతత చేకూరుతుంది. ముఖ్యమైన పనులు వాయిదా వేయండి. వృథా ఖర్చులు తగ్గించుకుంటే మంచిది. శివారాధన శ్రేయస్కరం.
తుల (Libra) : తులారాశి వారికి ఈ రోజు ఆనందదాయకంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి చేపట్టిన పనులు సకాలంలో విజయవంతంగా పూర్తి కావడం వల్ల సంతోషంగా ఉంటారు. కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టేందుకు మంచి రోజు. పలు మార్గాల ద్వారా ఆదాయం పెరగడం సంతోషం కలిగిస్తుంది. దూర ప్రాంతాల నుంచి అందిన శుభవార్త మీ సంతోషాన్ని రెట్టింపు చేస్తుంది. ఖర్చులు అదుపులో ఉంచుకుంటే మంచిది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. హనుమాన్ చాలీసా పారాయణ శ్రేయస్కరం.
వృశ్చికం (Scorpio) : వృశ్చికరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి పనిప్రదేశంలో పరిస్థితులు కొంత వ్యతిరేకంగా ఉంటాయి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే వారి పట్ల జాగ్రత్తగా ఉండండి. ఇతరుల విమర్శలకు అంత ప్రాధాన్యత ఇవ్వకండి. వాదనలు దూరంగా ఉండండి. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. అభయ ఆంజనేయస్వామి ఆలయ సందర్శనతో ఆపదలు తొలగిపోతాయి.
ధనుస్సు (Sagittarius) : ధనుస్సురాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి పరంగా సాధించిన విజయాలు సంతృప్తినిస్తాయి. ఆర్థిక లాభాలు ఉంటాయి. సామాజిక సమావేశాలలో పాల్గొంటారు. కుటుంబంతో తీర్థయాత్రలకు వెళ్తారు. జీవిత భాగస్వామి సంపూర్ణ సహకారం ఉంటుంది. వృథా ఖర్చులు తగ్గించుకోండి. దుర్గాదేవి దర్శనం మేలు చేస్తుంది.
మకరం (Capricorn) : మకరరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో సవాళ్లు సమర్థవంతంగా అధిగమిస్తారు. ఆదాయం ఆశించిన మేరకు ఉంటుంది. వాహనప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. చట్టపరమైన కార్యకలాపాలలో జాగ్రత్త వహించండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ సందర్శన శుభప్రదం.
కుంభం (Aquarius) : కుంభరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. అన్ని రంగాల వారు సామాజికంగా, ఆర్థికపరంగా అభివృద్ధి చెందుతారు. వృత్తి జీవితంలో గొప్ప మార్పులు చోటు చేసుకుంటాయి. ఇంటి వద్ద ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. దేవాలయాలను సందర్శిస్తారు. శుభవార్తలు వింటారు. ఇష్ట దేవతారాధన శుభకరం.
మీనం (Pisces) : మీనరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. సామాజికంగా మీ ప్రతిష్ట పెరుగుతుంది. ఆర్థికపరంగా, వృత్తిపరంగా, లాభాలు, పదోన్నతులు లభిస్తాయి. వ్యక్తిగత జీవితం సంతృప్తికరంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఊహించని ధనలాభాలు ఉంటాయి. బంధు మిత్రులతో విందు వినోదాలలో పాల్గొంటారు. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ శుభప్రదం.