KCR To Telangana Bhavan Today :మూడు నెలల విరామం తర్వాత భారత్ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ (KCR) హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌కు ఈరోజు రానున్నారు. శాసనసభ ఎన్నికలకు ముందు నేతల చేరికల సందర్భంగా పార్టీ కార్యాలయానికి వచ్చారు. ఎన్నికల ఫలితాల అనంతరం కేసీఆర్ తన వ్యవసాయ క్షేత్రంలో కిందపడడంతో తుంటి మార్పిడి శస్త్రచికిత్స జరిగింది. కోలుకున్న ఆయన ఎమ్మెల్యేగా కూడా ఇటీవలే ప్రమాణ స్వీకారం చేశారు. తాజాగా నేడు తెలంగాణ భవన్‌కు రానున్నారు.
EX CM KCR Address BRS Cadre Today : కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల ఔట్ లెట్ల అప్పగింత అంశంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా పోరాటానికి బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. తెలంగాణలో సాగు, తాగునీటి ఇబ్బందులు ఎదురవుతాయని, జల విద్యుత్ ఉత్పత్తికి తీవ్ర ఇక్కట్లు వస్తాయని అంటోంది. కేంద్రం ఎంత ఒత్తిడి తీసుకొచ్చినప్పటికీ బీఆర్ఎస్ హయాంలో ప్రాజెక్టులు అప్పగించలేదని చెబుతోంది. కానీ ఇప్పుడు సర్కార్ అనాలోచిత వైఖరి వల్ల కృష్ణా బేసిన్‌లోని దక్షిణ తెలంగాణ రైతాంగ సాగునీటి హక్కులపై గొడ్డలి పెట్టులా మారిందని ఆక్షేపిస్తోంది.
కాంగ్రెస్ 420 హామీలు చూసి జనం మోసపోయారు - చీకటి ఉంటేనే వెలుగు విలువ తెలుస్తుంది : కేటీఆర్
KCR Meeting With BRS Leaders Today :ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందులో భాగంగా నల్గొండ జిల్లాలోకృష్ణా జలాల(Handover of Projects to Krishna Board)పరిరక్షణ సభ నిర్వహించాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ సభకు పార్టీ అధినేత కేసీఆర్ హాజరు కానున్నారు. శాసనసభ ఎన్నికల్లో ఓటమి అనంతరం ఆయన మొదటి బహిరంగ సభలో పాల్గొననున్నారు.