KCR Takes Oath as MLA in Hyderabad :భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్(KCR) శాసనసభ్యునిగా ప్రమాణస్వీకారం చేశారు. ఇటీవలి ఎన్నికల్లో గజ్వేల్ నుంచి ఎన్నికైన ఆయన, ఇవాళ సభాపతి ప్రసాద్ కుమార్ సమక్షంలో ప్రమాణం చేశారు. అసెంబ్లీలోని స్పీకర్ ఛాంబర్‌లో ఆయన ఎనిమిదోసారి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్నికల ఫలితాల తర్వాత కాలుజారి పడిన కేసీఆర్, శస్త్రచికిత్స అనంతరం కోలుకుంటున్నారు.
'సర్పంచ్' పదవికి మాత్రమే విరమణ - ప్రజాసేవకు కాదు : కేటీఆర్
KCR Latest News :దీంతో ఇప్పటి వరకు శాసనసభ సమావేశాలకు హాజరు కాలేదు. ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు. ప్రస్తుతం చేతి కర్ర సాయంతో నడుస్తున్న ఆయన, ఇవాళ ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. తుంటి ఎముకకు శస్త్ర చికిత్స తర్వాత ఇటీవలే కోలుకున్న గులాబీ దళపతి, మంచి ముహూర్తం చూసుకుని సభాపతి కార్యాలయంలో స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ఎదుట ఈరోజు ప్రమాణం చేశారు.
‘వంట అయ్యాక గరిటె తిప్పినట్లు’గా కాంగ్రెస్ స్టాఫ్ నర్సుల నియామక పత్రాల జారీ : హరీశ్‌రావు
శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్, ప్రజాప్రతినిధులు, బీఆర్‌ఎస్ నేతలు తదితరుల సమక్షంలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం కేసీఆర్ భారత రాష్ట్ర సమితి శాసనసభ కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రతిపక్ష నేతగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు హాజరవగా, శాసనసభ ప్రాంగణం గులాబీమయమైంది.
హర్కర్ వేణుగోపాల్ పదవీ బాధ్యతల స్వీకరణ : మరోవైపుప్రభుత్వ సలహాదారుగా ప్రొటోకాల్ ఛైర్మన్ హర్కర్ వేణుగోపాల్ ఇవాళ పదవీ బాధ్యతలు స్వీకరించారు. డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ సచివాలయంలో తన కార్యాలయంలో వేద పండితుల పూజల అనంతరం ఆయన పదవీ బాధ్యతలను తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రొటోకాల్, ప్రజా సంబంధాల సలహాదారుగా బాధ్యతలు స్వీకరించిన హర్కర్ వేణుగోపాల్ రావుకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, బీసీ కమిషన్ ఛైర్మన్ కృష్ణ మోహన్ రావు, జీఏడీ కార్యదర్శి రఘునందన్ రావు, సమాచార శాఖ స్పెషల్ కమిషనర్ అశోక్ రెడ్డి, మాజీ ఎంపీలు వి.హనుమంత రావు, మధుయాష్కీ, దీపాదాస్ మున్షీ తదితరులు అభినందనలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వహిస్తానని హర్కర్ వేణుగోపాల్ వెల్లడించారు. పార్టీ పరంగా కానీ, ప్రభుత్వ పరంగా కానీ గతంలో మాదిరి నిబద్ధతతో పని చేస్తానని వివరించారు.
గ్రూప్-1 నోటిఫికేషన్ ఇస్తారనుకున్న నిరుద్యోగుల ఆశలపై నీళ్లుచల్లారు: హరీశ్‌రావు