Justice PC Ghose Investigating Former Kaleshwaram ENC :కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ల విషయంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, హరీశ్‌రావు ఒత్తిడి తెచ్చారని సీడీవో విశ్రాంత ఈఎన్సీ నరేందర్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్, హరీశ్‌రావుతో పాటు ఉన్నతాధికారులు డిజైన్లు త్వరగా ఆమోదించాలని తమను ఒత్తిడికి గురిచేశారని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలపై విచారణ చేస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ చేపట్టిన విచారణలో భాగంగా ఇవాళ (గురువారం) కమిషన్ ముందు సీడీవో మాజీ ఈఎన్సీ నరేందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన కీలక అంశాలను ప్రస్తావించారు.
సరిదిద్దే అవకాశం ఉన్నా స్పందించలేదు :బ్యారేజీలు నిర్మించాల్సిన ప్రాంతాలకు అనుగుణంగానే డిజైన్లు రూపొందించామని సీడీవో మాజీ ఈఎన్సీ నరేందర్ రెడ్డి కమిషన్‌కు వివరించారు. సీడబ్ల్యూసీకి పంపిన తర్వాత కూడా డిజైన్లలో కొన్ని మార్పులు జరిగాయని వెల్లడించారు. బ్యారేజీల నిర్వహణ సరిగా లేదని, మేడిగడ్డ ఘటన తర్వాత కూడా సరిదిద్దే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. సరిదిద్దే అవకాశం ఉన్నా తగిన రీతిలో స్పందించలేదని తెలిపారు.