Karimnagar Historic Places :చారిత్రాక కట్టడాలు, పురాతన దేవాలయాలు, జలపాతాలు పర్యాటకుల మనసులను పులకరింపజేస్తాయి. యాత్రికులను ఆకట్టుకనే పుణ్యక్షేత్రాలు, రాజులు పాలించిన ప్రాంతాలను ఇప్పటికీ వేల మంది సందర్శిస్తున్నారంటే వాటి ప్రాధాన్యత ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. ఆయా ప్రాంతాల్లో సౌకర్యాలు, వసతులు కల్పిస్తే ఆదాయం మరింత సమకూరనుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పర్యాటక క్షేత్రాల విశేషాలు, వాటి అభివృద్ధి అనుకూలతలపై స్పెషల్ స్టోరీ.
ప్రదేశం :ఎలగందుల ఖిల్లా, కరీంనగర్ జిల్లా
నిర్మించినది :శాతవాహనులు. కోటి లింగాలను రాజధానిగా ప్రాంతీయ ఏడు రాజులు గోభద, నారన, కంవయస, సమగోప పాలనలో నిర్మితమైనట్లు లభ్యమైన నాణేలను బట్టి తెలుస్తుంది.
ప్రత్యేకత :ఈ కోట శాతవాహనులతోపాటు బాదామి చాళుక్యుల (550-750) నుంచి ఆసఫ్‌జాహీల(1724-1948) కాలం వరకు పాలన కేంద్రంగా విరాజిల్లింది. ఒకప్పుడు జిల్లా కేంద్రంగా ఉండేది.
కల్పించాల్సిన సౌకర్యాలు :ఎలగందులు ఖిల్లా చారిత్రాక ప్రాంతం కావడంతో ప్రభుత్వం 2014లో పర్యాటక కేంద్రంగా ప్రకటించింది. అప్పుడు సౌండ్ అండ్ లైట్ షో ఏర్పాటు చేశారు. కొద్దిరోజుల తర్వాత అది నిలిచిపోయింది. సామాగ్రి పాడైపోయింది. పర్యాటకంగా అభివృద్ధి చెందాలంటే గార్డెన్స్, పార్కులు, రెస్టారెంట్లు, రవాణా సౌకర్యాలు, వసతులు కల్పించాలి. కోట గురించి తరాల వారికి తెలిసే విధంగా తీర్చిదిద్దాలి.
ప్రదేశం :మొలంగూరు ఖిల్లా, కేశవపట్నం మండలం, కరీంనగర్ జిల్లా
నిర్మించినది : ప్రతాపరుద్రుని అధికారులలో ఒకరైన వొరగిరి మొగ్గరాజు దీనిని నిర్మించాడు.
ప్రత్యేకత :దూద్ బావి బహుళ ప్రాచుర్యం
కల్పించాల్సిన సౌకర్యాలు : మొలంగూరు గుట్టపైన, కింద కోనేరులు దూద్ బావి, శివాలయం, వీరభద్రాలయం, కోట బురుజులు, రాతి ద్వారాలు, కందకాలు, ఫిరంగులు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. ఇక్కడ ఉన్న దూద్ బావలోని నీరు పాలవలె తెల్లగా ఉంటాయి. ఈ నీరు ఆరోగ్యానికి మంచిదని ఆ గ్రామస్థులు నమ్ముతారు వాటిని తీసుకెళతారు. ఈ ప్రాంతంలో సుందరీకరణ పనులు చేపడితే పర్యాటకుల తాకిడి పెరుగుతుందని అంటున్నారు.
ప్రదేశం :రామగిరి ఖిల్లా, కమాన్‌పూర్ మండలం బేగంపేట, పెద్దపల్లి జిల్లా
నిర్మించినది : శాతవాహనులు నిర్మించారని చారిత్రక అధారాలు చెబుతున్నాయి. వారు దీనిని రక్షణ కోటగా వినియోగించుకొని కోటి లింగాలను రాజధానిగా చేసుకొని పాలించారు.
ప్రత్యేకత :శత్రుదుర్భేద్యమైన ఈ కోట అరుదైన శిల్పకళ, బురుజులకు నిలయం. కోట పరిసర ప్రాంతాల్లో వనమూలికల సంపత్తి, అరుదైన వృక్షాలున్నాయి.
కల్పించాల్సిన సౌకర్యాలు :రామగిరి ఖిల్లా ప్రాంతంలో వనమూలికలు, అరుదైన వృక్షాలను చూసేందుకు వివిధ రాష్ట్రాల శాస్త్రవేత్తలు, ఆయుర్వేద నిపుణులు ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో వస్తారు. ఈ కోటకు అన్ని రకాల వసతులు, సౌకర్యాలు, కల్పించి అభివృద్ధి చేస్తే సుందరమైన ప్రదేశంగా విరాజిల్లుతుంది. వివిధ విశ్వవిద్యాలయాల విద్యార్థులకు బొటానికల్ గార్డెన్‌గా మారుతుంది.
ప్రదేశం :కరీంనగర్ మానేరు జలాశయం