తెలంగాణ

telangana

ETV Bharat / state

కాశీలో పార్థివ శివలింగార్చన - కోటి లింగాల ప్రతిమలను తయారు చేస్తున్న కామారెడ్డి మహిళలు - 1crore Shiva idol Making kamareddy - 1CRORE SHIVA IDOL MAKING KAMAREDDY

1 Crore Clay Shiva Idols Making in Kamareddy : కార్తీక మాసంలో కాశీలో జరిగే కోటి పార్థివ శివలింగార్చన కోసం మహిళలు భక్తి శ్రద్ధలతో శివలింగాలను మట్టితో తయారు చేస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాతో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మట్టి శివలింగాలను సిద్ధం చేస్తున్నారు. స్వయంగా పుట్టమట్టిని సేకరించి, ఎంతో భక్తితో లింగాలను తయారు చేసి కాశీకి పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెబుతున్నారు శివయ్య భక్తులు.

Kamareddy Women Making 1 Crore Clay Shiva Idols
1 Crore Clay Shiva Idols Making in Kamareddy (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jun 15, 2024, 5:23 PM IST

కాశీలో పార్థివ శివలింగార్చన కోటి లింగాల ప్రతిమలను తయారు చేస్తున్న కామారెడ్డి మహిళలు (ETV Bharat)

Kamareddy Women Making 1 Crore Clay Shiva Idols :రాష్ట్రంలో పలు జిల్లాలలో మట్టి శివలింగాలను తయారు చేస్తున్నారు. సాంబసదాశివ మహాదేవ ట్రస్ట్‌ ఆద్వర్యంలో ఆ కార్యక్రమం చేపట్టారు. ఎంతో పవిత్రంగా విగ్రహాల తయారీలో మహిళలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఇక్కడ తయారు చేసిన శివలింగాలను కాశీకి పంపించనున్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాలతో పాటు తిరుపతిలోనూ ఆ కార్యక్రమం కొనసాగిస్తున్నారు. శివున్ని స్మరిస్తూ 25 రోజులుగా మట్టిలింగాలను తయారు చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా భిక్కనూరు శ్రీ సిద్దరామేశ్వర ఆలయంలో నిత్యం 50 మంది మహిళలు 20 వేల వరకు సిద్ధం చేస్తున్నారు. జిల్లాలో ఇప్పటి రకు సుమారు 60 వేళ మట్టి శివలింగాలను తయారుచేశారు

"కాశీ సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో మట్టితో కోటి లింగాలు చేయించి ఇవన్నీ కూడా కాశీకి పంపిస్తాం. కాశీలో కార్తీక మాసంలో నవంబరులో కోటి లింగార్చన, కల్యాణాలు, లక్ష బిల్వార్చన జరుగుతాయి. అందుకోసం కోటి లింగాల తయారీకి కావాల్సిన మట్టిని అన్ని ఊర్లల్లో అందజేశారు. ఈ లింగాలన్నింటినీ ఒక దగ్గరకు చేర్చి పూజలు చేసి నిమజ్జనం చేస్తాం." - జగన్నాథం, కామారెడ్డి

ఆ నదిలో బాణలింగాలు దొరుకుతాయి!

కాశీ విశ్వేశ్వరుని సన్నిధానంలో జరిగే కోటి శివలింగార్చన పూజకి మరో నాలుగు నెలల మాత్రమే ఉండడంతో భక్తులు శివలింగాల తయారీలో నిమగ్నమయ్యారు. కామారెడ్డి జిల్లా భిక్కనూరుతో పాటు పలు జిల్లాలో తయారు చేసిన పరమశివుడి మట్టిప్రతిమలను ఒకే చోటుకు చేర్చి ఒకేసారి కాశీకి పంపేలా ఏర్పాట్లు చేస్తున్నారు. భోళాశంకరుడి ప్రతిమలను కామారెడ్డిలో తయారు చేయడంపై మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.కాశీలో జరిగే పూజల కొరకు ఇక్కడ తయారుచేసిన లింగాలను తీసుకువెళ్లడం తమ అదృష్టంగా భావిస్తున్నట్లు మహిళలు చెబుతున్నారు.

"సాయిబాబా గుడిలో అందరం కలిసి లింగాలను తయారు చేస్తున్నాం. మాకు ఈ అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాం. ఇక్కడ తయారు చేసిన లింగాలను కాశీకి తీసుకెళ్లి అక్కడ తొమ్మిది రోజుల పాటు పూజలు చేసి వాటిని నిమజ్జనం చేస్తారు. లింగాల తయారీకి కావాల్సిన మట్టి, ముద్రలు అన్ని మాకు ఇచ్చారు. దేవుడి ప్రతిమలు తయారు చేయడం బాగా అనిపిస్తుంది." - మహిళలు

రామాలయంలోని శివలింగంపై నాగుపాము - ఆశ్యర్యానికి గురైన ప్రజలు

రోజుకు 7 సార్లు రంగు మార్చే శివ లింగం!

ABOUT THE AUTHOR

...view details