JURALA PROJECT 32 GATES OPEN :జోగులాంబ గద్వాల జిల్లా జూరాల జలాశయానికి భారీ వరద నీరు వచ్చి చేరుతుండడంతో 32 గేట్లు తెరిచి దిగువకు నీరు వదులుతున్నారు. ఎగువన ఉన్న మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టుకు లక్ష 60వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. గేట్ల ద్వారా లక్ష 24వేలు క్యూసెక్కులు, జల విద్యుత్ ద్వారా 28,718 క్యూసెక్కుల చొప్పున నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో శ్రీశైలానికి వరద ప్రవాహం పెరుగుతోంది.
జూరాల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 9.657టీఎంసీలు కాగా ప్రస్తుతం 7.798 టీఎంసీలుగా ఉంది. అలాగే పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు అయితే ప్రస్తుతం 317.580 మీటర్లు ఉంది. జూరాల జలాశయం కింద ఉన్న కుడి, ఎడమ కాలువలతో పాటు నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ ద్వారా సాగు కోసం నీటిని విడుదల చేస్తున్నారు.
జూరాలకు జలకళ - పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తి - Huge Water Inflow To Jurala Project
పరివాహక ప్రాంతాలకు హెచ్చరికలు :ఆల్మట్టి ప్రాజెక్టుకు లక్షా 15వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా, లక్షా 44వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి నీటి సామర్థ్యం 129 టీఎంసీలు కాగా ప్రస్తుతం 93.80 టీఎంసీలుగా ఉంది. నారాయణపూర్ ప్రాజెక్టుకు లక్షా 44వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా, 27 గేట్లెత్తి లక్షా 44వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. రాబోయే రెండు రోజుల్లో జూరాల ప్రాజెక్టుకు ప్రవాహం పెరగొచ్చని, నది పరివాహక ప్రాంతంలో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
"నారాయణ్‌పూర్ నుంచి దాదాపు లక్షా 40వేల క్యూసెక్కుల నీరు జూరాలకు వస్తోంది. జూరాల ద్వారా సుమారు 28 వేల క్యూసెక్కుల నీటిని జల విద్యుత్ ద్వారా దిగువకు వదులుతున్నాం. గేట్లు, జలవిద్యుత్ రెండు కలిపి లక్షా 60వేల క్యూసెక్కుల నీటిని పంపిస్తున్నాం. జూరాల కాలువల ద్వారా వ్యవసాయానికి నీటిని వదులుతున్నాం. ఆల్మట్టి ప్రాజెక్టు ద్వారా లక్షా 44వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది." - అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, జూరాల ప్రాజెక్ట్
క్షణక్షణం భయంభయం - డేంజర్ జోన్లో కుమురంభీం ప్రాజెక్టు - మరో ముప్పు తప్పదా? - Komaram Bheem Project Problems
తాలిపేరు ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి - 25 గేట్లు ఎత్తి గోదావరి నదిలోకి నీటి విడుదల - Heavy Floods to Taliperu Project