Mock Drill At Hussain Sagar : హైదరాబాద్ హుస్సేన్‌సాగర్ తీరంలో ప్రకృతి విపత్తులపై సైన్యం, జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ, డీఆర్‌ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది సంయుక్త ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. వరదల్లో చిక్కుకున్నవారిని రక్షించేందుకు తీసుకోవాల్సిన చర్యలు సహా వారికి ఆహారం, ఔషధాలు డ్రోన్ల ద్వారా ఎలా చేరుస్తారనే అంశాలను వివరించారు. రెండు గంటల పాటు హుస్సేన్‌సాగర్ తీరాన మాక్‌డ్రిల్ కొనసాగింది.
విపత్తు నిర్వహణపై మాక్‌డ్రిల్ :దేశంలో ఎక్కడయినా ప్రకృతి విపత్తులు ఎదురైనప్పుడు ప్రధానంగా వరదలు వస్తే ఎలా స్పందించాలి? వరద నీటిలో, ముంపులో చిక్కుకున్న వారిని ఎలా కాపాడాలి? తీసుకోవాల్సిన చర్యలు, బాధితులు ఆందోళన చెందకుండా వారి వద్దకు ఆహారం, ఔషధాలు డ్రోన్ల ద్వారా ఎలా చేరుస్తారు? తదితర విషయాలపై మాక్ డ్రిల్ ప్రదర్శించారు. దాదాపు రెండు గంటల పాటు కార్యక్రమం జరిగింది.
విపత్తు సేవల్లో ముందుంటారు :ఆయా శాఖల అధికారులు, సిబ్బంది కార్యక్రమంలో పాల్గొని తాము చేపట్టే సహాయ కార్యక్రమాలను కళ్లకు కట్టారు. ప్రకృతి విపత్తుల తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు సైన్యం సహాయం తీసుకుంటారు. బాధితులను రక్షించడమే కాదు గాయపడిన వారికి వైద్య సహాయం కూడా సైన్యం అందిస్తోంది. ముంపు ప్రాంతాలు, నీటిలో వెళ్లేందుకు వీలుగా తాత్కాలికంగా సైన్యం ఫుట్ బ్రిడ్జ్‌లు నిర్మిస్తారు. వాటి ద్వారా నీటిలో వెళ్లి పరిస్థితిని అంచనా వేసి అందుకనుగుణంగా సహాయ కార్యక్రమాలు చేపడతారు.