Janasena Party Fund Cheques: రాజకీయ పార్టీలకు పలు రకాలుగా విరాళాలు వస్తుంటాయి. విరాళాల ద్వారా వచ్చిన నిధులే కొంతవరకు పార్టీలను ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేస్తాయి. ఇలా పార్టీని బలోపేతం చేసేందుకు దోహదం చేసే విరాళల చెక్కులను జనసేనాని నిరాకరించారు. అసలు ఆయన విరాళాల చెక్కులను ఎందుకు నిరాకరించాల్సి వచ్చింది. చెక్కులను నిరాకరించడానికి కారణాలు ఏమై ఉంటాయి.
రాష్ట్రంలో ఎన్నికలు సమీపీస్తున్న వేళ రాజకీయ పార్టీలకు విరాళాల చెక్కులు రావడం సాధారణమే. ఇటీవల పార్టీకి విరాళాలు అందిస్తున్నామని కొందరు వ్యక్తులు జనసేనకు చెక్కులు అందించారు. అయితే చెక్కులు ఇచ్చిన వారిలో ఇంతకముందే పార్టీలో పనిచేస్తున్నవారు ఉన్నారు. వారితోపాటు ప్రస్తుతకాలంలోనే జనసేన తీర్థం పుచ్చుకున్నవారు కూడా ఉన్నారు. కొందరైతే పార్టీలో చేరని వారు వారు కూడా విరాళాల రూపంలో చెక్కులు అందించారు. ఈ విషయం జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు తెలియడంతో ఆయన చెక్కుల అంశంపై అప్రమత్తమయ్యారు.
జనసేన ఎంత మందికి టికెట్లు ఇవ్వాలో హరిరామజోగయ్య శాసించడం సరికాదు: ఓవీ రమణ
చెక్కులు వెనక్కి పంపాలని ఆదేశాలు: పార్టీకి విరాళాల పేరుతో వస్తున్న చెక్కుల పట్ల అప్రమత్తత అవసరమని పార్టీ కార్యాలయ సిబ్బందికి సూచించారు. పార్టీని దెబ్బతీసేందుకు అధికార పార్టీ ఇలాంటి కుట్రలు చేస్తోందనే అనుమానం వ్యక్తం చేశారు. గతంలో కన్నా ఇప్పుడు అధికంగా చెక్కులు రావడాన్ని ఆయన గమనించారు. ఈ క్రమంలో ఇటీవలే పార్టీలో చేరి చెక్కులు అందించి సీట్లు అభ్యర్థిస్తున్న వారి చెక్కులను వెనక్కు పంపాలని కార్యాలయ సిబ్బందిని ఆదేశించారు.